పుట:Manimalikalu.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

56.

 ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు ఎన్నటికీ తెలియదు
ఎందుకు ప్రేమిస్న్నానో నాకు ఎప్పటికి అర్ధమవదు

57.

భావమాలికలతో అలంకరిస్తున్నా నిన్ను
కనకానికి కరువు గానీ అక్షరాలకు కొదవ లేదుగా

58.

ఊహాచిత్రాలు గీస్తూనే ఉంటాను అసంఖ్యాకంగా
అస్పష్టమైన నీరూపం స్పష్టమయ్యే దాకా

59.

రెప్ప మూసిన క్షణం ఎదుట ఉన్నావనిపిస్తుంది
కన్ను తెరిచిన నిముషం వాస్తవం వెక్కిరిస్తుంటుంది

60.

నేను ప్రవరాఖ్యుడినే
మనసు మార్చుకుంది నిన్ను చూసాకనే

61.

నీతో గడిపిన తీయని క్షణాలివ్వు
వియోగపు యుగాలని నిర్దయగా చంపనివ్వు

62.

నీ వియోగం మద్గురమైన జ్ఞాపకాలను మెల్లగా మింగేస్తోంది
ఆకలిగొన్న అజగరం చిక్కిన లేడిని నిదానంగా కబళిస్తున్నట్లు

63.

నువ్వు భాషిస్తే నా చెవులకి వినబడుతుంది
శ్వాసిస్తే నీలోని నా మనసుకి ఊపిరందుతుంది

64.

రెండు మనస్సుల పెదవులు
ఇచ్చిపుచ్చుకుంటున్నాయి తీయగా మధువులు

65.

రాధామాధవం చూసిందేమో!
బృందావనం దగ్గర మరీ సిగ్గు పడుతోంది యమున

మణి మాలికలు జ శ్రీనివాస్‌ ఆర్‌.వీ.ఎస్‌.ఎస్‌

149