పుట:Manimalikalu.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

144

6

 నీవు నాచెంతనుంటే తెలియని తిథి
అందరూ చీకటిమయం అనుకొనే అమావాస్య

7.

నీ జ్ఞాపకాలు కదిలేవి కాదు
నీ రూపం చేరిగేది లేదు.

8.

మన పేర్లు ఇసుకలో వ్రాసినా
జ్ఞాపకాలు మాత్రం దాచుకున్నవి మదిలోనే

9.

చంద్రకాంతులు కనిపించడమే కాదు
వినిపిస్తాయి...నీ పాదాలనల్లుకొని!

10.

కలం పడితే కవితయ్యేవరకు ఆపకు
కత్తి ఎత్తితే సంహరించేదాకా ఆగకు

11.

అడుగులు చూసి వేయవూ?
పారిజాలకు కూడ ముళ్ళుంటాయి

12.

నీ ముక్కుకి ఎంత పొగరో?
అలక ముక్కెర అస్తమానూ సర్దుకుంటూ

13.

ప్రత్యూషం పారిపోయింది నిన్ను చూసి
తొందరగా ఎందుకు వచ్చానా? అనుకుంటూ

14.

నా కన్నులడుగుతున్నాయి నీ కళ్ళని
నాలాగే రాత్రంతా నిదురపోలేదా? అని

15.

అక్షరాల లోయల్లో వెదుకుతున్నా
పదాల పువ్వుల కోసం

మణి మాలికలు జ శ్రీనివాస్‌ ఆర్‌.వీ.ఎస్‌.ఎస్‌