పుట:Manimalikalu.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

86.

నేనౌనంటే నువ్వు కాదంటావు
అచ్చం నా మాట వినని నా మనసులా

87.

ఎంత నేర్ప రివో
గుండెలోని హాలాహలం చల్లార్చి మాటలతో అమృతాన్నిచిలికించేస్తూ

88.

మనస్సు పరిమళిస్తోంది
వసంతునిలా వలపుల పల్లవులేవో ఆలపిస్తుంటే

89.

నీ నవ్వుల తివాచీ పరిచావా ?
అందరాని పాలపుంత చెంతచేరిందని భ్రమపడ్డా !

90.

తనువుకే కాదు
మనస్సుకు అలుపేనంట...నీ జ్ఞాపకాల భారాన్ని మోసి

91.

అక్షరాలన్నీ మెరిసే తారకలే
నీ పదాలను అల్లుకుంటే

92.

కన్నీటితో తొణికింది మదికొలను
నను విడిచిన మరుక్షణమే

93.

మనసూ మాటలు నేర్చింది
అధరాలపై దరహాసపులేఖలను లిఖిస్తూ

94.

ఆశావిహంగాలు ఎగిరిపోతున్నాయి
నీగుండెగూటిని చేరే దారి తెలియక

95.

గుండె పగిలిన చప్పుడుకేమో
దుఖగీతమాలపిస్తూనే..దొర్లిపోతోంది కాలం

140

మణి మాలికలు జ సిరి వడ్డే