పుట:Manimalikalu.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

138

66.

గరికపూలకు పులుముతున్నా
దోసిలిపట్టిన నీ దరహాసపు పరిమళాలను!

67.

నా మౌనానికి బాషను నేర్పెళ్లావు
రోజంతా నీనామమే జపం చేస్తోంది

68.

నా ఆత్మకి ప్రతిరూపం
నీ రూపంలో సంచరిస్తూ

69.

నీమాటలెపుడూ కమ్మని గేయాలే
తీయని గాయాలనే చేస్తూ

70.

రాలిపోయే పూలకెన్ని గాయాలో
కొమ్మను వీడే విషాదంలో

71.

రాధమ్మ మనసెంత గాయపడిందో
కన్నయ్య అందరి (అందని)వాడు అవుతున్నందుకు

72.

ఎన్ని గాయాలను మోసి ఉంటుందో వెన్నెలమ్మ
ప్రతి తారతో సరసాలాడే నెలరేడును తలచి

73.

మారణాయుధమే నేనౌతా
ఆపదే నీకు గాయం చేస్తే

74.

జ్ఞాపకాల శబ్దాలు
అంతరంగంపై శాశ్వత శిల్పాలను చెక్కుతూ

75.

మది జోగుతోంది కలల లోకంలో
నీ మాటల మత్తుగుళికలను మింగి

మణి మాలికలు జ సిరి వడ్డే