పుట:Manimalikalu.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

56.

 మత్తకోకిలకు మరుపు ఎక్కువైనట్లుంది
మధుమాసానికి ముందే మైమరుస్తోంది

57.

బిడియాన్నే పూర్తిగా వదిలేసింది నామనసు
నువ్వెంతగా గాయపరుస్తున్నా నిన్నేస్మరిస్తూ

58.

ఈ జన్మకెంత ఆత్రమో
మరుజన్మలో నిన్నుఎలా కలవాలనే ఆలోచనలలో మునుగుతూ

59.

నాజాడనే మరిచింది వింతగా
నీ జాడలలోనే గుడ్డిగా నడుస్తున్న నా మనస్సు

60.

హోయలొలుకుతోంది శ్రావణ మేఘం
చినుకుల జూకాలను(లోలకులను)పెట్టుకుని

61.

నీ పరిచయంతోనే తెలిసింది
జ్ఞాపకాలకూ పరిమళం ఉంటుందని

62.

కనుపాపలకు యెంత కలవరమో?
కనుమరుగైపోయే నీరూపాన్ని చూపాలని

63.

వేపపూల వసంతం
నీతలపుల ఉగాదిలో

64.

కంటి ప్రమిదల్లో...ఆశలవత్తులెన్నో
కన్నీటి చమురులతోనే వెలిగిస్తూ

65.

కలువ భామకెంత మురిపెమో
నెలరాజు కురిపించే వెన్నెల చినుకులు తలంబ్రాలై తాకుతుంటే

మణి మాలికలు జ సిరి వడ్డే

137