పుట:Manimalikalu.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

106. తను రాసిన ప్రేమలేఖ.. ఎపుడు చదివినా
అక్షరాలు అలుక్కునే.. కన్నీరు చూపుకి అడ్డుపడి

107. అలసిపోయిన మదిసంద్రంలో
అలలూ లేవు..కలలూ లేవు

108. నాదైన లోకంలో
నీకు మాత్రమే చోటుంది...నాకు కూడ లేకుండ

109. గాయాన్నితిరిగి రేపకే సమయమా
చివరి కన్నీటిచుక్క ఎప్పుడో ఇంకిపోయింది.

110. అక్షరాలు అన్నీ పోటీ పడుతున్నాయి
మా మొదటిపరిచయాన్నిఅందంగా వర్ణించడానికి

111. కలం కదలదు...కాలం ఆగదు
కొన్నిరోజులుగా అన్ని తెల్లకాగితాలే..డైరీలో

112. ఎండమావిలో నీరు
కనులకే సొంతం

113. ప్రేమ గాయాన్ని చేస్తుందా...?
ఊహూ˙..చేసింది ప్రియురాలు

114. చెలి అందియగా మారిపోయా
మువ్వల సవ్వడికి నా ఎదలయతో తాళం వేస్తూ

115. నాదాంటూ ఏముంది?
నీకు ఇవ్వడానికి.. కన్నీళ్ళతో సహా

124

మణి మాలికలు జ సాయి కామేష్‌ గంటి