పుట:Manimalikalu.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

122

86.

ఒకశబ్దం తర్వాత పూర్తిగా నిశ్శబ్దం
తడిమి చూసుకున్నా...పగిలిన హృదాయం

87.

ప్రతి ప్రశ్నకి బదులుందా?
'లేదు' ఒక సమాధానమే

88.

మదిలో అస్పష్టమైన భావాలకి
చ(చి)క్కి రూపాన్నిస్తూ...చీకటి

89.

అర్ధాంగి అంటే సగభాగమేనట
నాకేమి తనే సర్వస్వమనిపిస్తోంది

90.

నీకు మేఘసందేశం పంపుదాం అనుకున్నా
మేఘాలే కనపడలేదు...కనులుమాత్రం వర్షించాయి

91.

నిన్నునేను చూసినపుడు
కాలం కొన్నిక్షణాలు పారేసుకుంది

92.

కనుపాప జలకాలాడింది
స్మస్కృతిని శృతి చేసిన ప్రతీసారీ

93.

జాలువారకే కన్నీరా
జాలిపడేవారు ఎవరూ లేరు ఇక్కడ

94.

నేనెవరినని ప్రపంచమంతా అంవేషించా
సమాధానం నీ చిరునవ్వులో దొరికింది...నీఆనందామే నేనని

95.

నిను కలవడమే జీవితగమ్యం అనుకున్నా
కలిసాకే తెలిసింది నాప్రయణం ఆరంభమైందాని

మణి మాలికలు జ సాయి కామేష్‌ గంటి