పుట:Manimalikalu.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

36.

కాలం మాత్రం గడియారంలో చక్కర్లు కొడుతుందట
నన్ను మాత్రం వర్తమానంనించి భవిష్యత్లోకి తోసేస్తూ

37.

గతానికి ఆకలెక్కువ.
వర్తమాన భవిష్యత్లను మింగేస్తుంది మెల్లగా

38.

డైరీ రాస్తుంటే.
నా కన్నీటిలోదూకి కొన్ని అక్షరాలు ఆత్మహత్య చేస్కుంటున్నాయ్

39.

నీకై పరచిన నామనసుపై
నీపాదాల స్పర్శ బదాులు పరిస్థితుల పదాఘట్టనలు...పరిహసిస్తూ

40.

నిరీక్షణలో నిర్బంధించకు
ఎదురుచూపులు ఎదని కోసేస్తున్నాయి, కాలమనే రంపంతో నిర్దయగా

41.

నామనసు అక్షయపాత్ర
ఎన్ని జ్ఞాపకాలు కన్నీళ్ళుగా ఖర్చైనా

42.

విరహం అంటే
వీడిపోవడం కాదు... మానసికంగా వీడలేకపోవడం

43.

నువ్వు తీరానివో...లేక అందానంత దాూరానివో
నేను మాత్రం కన్నీ అలనే ఎపుడూ

44.

నీ పరిచయం
నా సుస్పష్టాస్పష్టాల మధ్యాంతర రేఖ

45.

అడుగు బైటకేస్తున్నావా...?
కలికాలం కాదామ్మాయ్‌. ఇది 'ఆకలి'కాలం

మణి మాలికలు * సాయి కామేష్‌ గిం

117