పుట:Manimalikalu.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
16.నా వేదనతో రమిస్తూ నిశి
అక్షరాలు ప్రసవిస్తోంది..నా డైరీలో
17.వర్షంలో తడవటం ఇష్టమన్నావుగా
ఇదిగో నా కనులు వర్షిస్తున్నాయి.. ఇపుడైనా రావా
18.నా కలానికి పదాును ఎక్కువ
ఒక్కోసారి నా మనసునే కోసేస్తుందాది.
19.ఎక్కడ ప్రారంభమైనా
నీతోనే అంతమøతోంది..నా ప్రతీఅలోచన
20.ఎటు వెళ్ళాలో సందిగ్ధం మనసుకి.
అటువైపు తాను...ఇటువైపు నేను
21.తాగిన వెన్నెల చాల్లేదేమో
తొడిమలింకా ఎర్రనే ..పారిజాతాల్లో
22.నీ తలపులు
ప్రతిరాత్రీ నా నిదురని భోంచేస్తూ
23.ప్రేమకు తను పెద్దాబాలశిక్ష
విరహా నికి నేను విజ్ఞాన సర్వస్వం
24.మానవత్వం మరణిం చింది
నడివేసవిలో..గుక్కెడు నీళ్ళు దొరక్క.
25.అమ్మాయి చేతి స్పర్శ తాకినందాుకేనేమో
వాకిట్లోముగ్గులకి అన్నాన్ని మెలికలు

మణి మాలికలు *సాయి కామేష్‌ గిం</poem>

115