పుట:Manimalikalu.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

114

6.

విరహమంటే ఎప్పికైనా నువ్వొస్తావనే ఆశ
విషాదామంటే నువ్వెప్పటికి రావన్న వాస్తవం

7.

నీమది చేరని నాభావాలు
నీకాలను పట్టుకుని వేలాడుతున్నాయి

8.

ఇప్పటిదాకా నాతోనే ఉన్నాడు'
బాధాగా అంటోంది మరణ లేఖలో చివరి అక్షరం

9.

కన్నీళ్ళతో కడగి యడనికి
నువ్వు నలుసువి కాదు...కనుపాపవి

10.

చెత్తబుట్ట నోరు తెరిచింది
తొలిప్రేమలేఖ రాయడం మొదలెట్టగానే

11.

ఆగకుండ ఎక్కిళ్ళ చప్పుళ్ళు
మదిఖర్కానాలో జ్ఞాపకాలు తయారౌతుంటే

12.

ఆలుమగల మధ్యా గొడవట
భార్య ఏకపాత్రాభినయమే వినిపిస్తోంది

13.

ఎన్ని తారలు మింగిందో మరి
అమాశలోనూ..చీకటి మెరుస్తోంది..వింతగా

14.

హోళీ అంటె తనకిష్టమంది
నల్లరంగే చల్లుతోంది...మనసుపై

15.

మాటలు మరణించాయి మరి
నిశ్శబ్దంగా మøనంచెక్కిలిపై...జ్ఞాపకాలచారికలు

మణి మాలికలు * సాయి కామేష్‌ గిం