పుట:Manimalikalu.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

106. స్థితప్రజ్ఞతలో మేటి. మనుషుల్ని కలుపుతూ, విడదీస్తూ... రైలు

107. ఓపిక లేని భ్రమరం రాలు పూలకై చూస్తూ

108. తులసి తీర్థంలా. చెలి నవ్వు... చివరి క్షణాల్లో

109. పేదోడు ఆకలి వల్ల దొంగ పెద్దోడు వాళ్ళ వల్ల దొర

110. నా చూపుల గోరింట చెలి చెక్కిళ్ళలో పండుతూ

111. కాలుతున్న భూగోళం పట్టుకోవడానికి ఆకులేవీ?

112. సూర్యుని చెర్నాకోల మేఘాల వృషభాలపై

113. స్రవిస్తున్న శవాన్నయ్యా నీ జ్ఞాపకాలకాకి పొడిచి పొడిచి

114. జాబిల్లిని వీడని తారల్లా చెలి మోమున మొటిమలు

115. శ్రీనాధుని కలంలా నీ వేలికొసలతోనే ఎంత శృంగారమొలికిస్తావు!

108

మణి మాలికలు * రాజేష్‌ యాళ్ళ