పుట:Manimalikalu.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

96.

కలం బానిసైంది.. కాగితపు స్పర్శకి

97.

తన్మయమౌతూ కాగితకన్నె కితకితలు పెడుతున్నది కలంకుర్రాడు మరి

98.

మౌనం రాజ్యమేలితే ఏలనీ చూపుల సామ్రాజ్యాల్లో ఉన్నాంగా

99.

కులుక్కో కుదుపు నీ లోలాకుతో... నా గుండెలో

100. బూచాడని భయపెట్టేది దేవుడే బూచాడై ఎత్తుకుపోయాడు అమ్మని

101. మాఊరు తప్పిపోయింది రచ్చబండ లేదు.... గంగరావీ లేదు

102. నీ మధుర జ్ఞాపకాలకు ముత్యాలు అడ్డుకుంటున్నా కన్నీటితో

103. కూసింత సోటెట్టు సాలు మనసంతా మేడ కట్టేస్తా

104. కవితాపల్లకిని మోస్తూ భావాల బోయీలు

105. అయిష్టంగానే శిశిరమయ్యా వసంతమై వాటేస్తావని

మణి మాలికలు * రాజేష్‌ యాళ్ళ

107