పుట:Manimalikalu.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

56.

చెరిగితే ఒట్టు గుండెలో నీ జ్ఞాపకాల పచ్చబొట్టు

57.

కులాన్నేం అనకు కనిపెట్టిన కుటిలత మనిషిది కదా

58.

ఆకాశంలోనూ షరతులే అందాుకే అన్ని పువ్వు గుర్తులు

59.

జ్ఞాపకాలపూలు దండ చేస్తుంటే వర్తమానపు సూది కసుక్కుమంది.

60.

అడుగులో అడుగయ్యను చేతిలో చెయ్యే బావుంది నీ పక్కన నడుస్తూ

61.

అవినీతి-కులాల మబ్బుల్లో మా ప్రజాస్వామ్యపు చందమామ

62.

పెళ్ళే!! తగలబడుతోంది.. నీవు పేర్చిన ఒంటరితనపు చితిలో

63.

జీవిత శిశిరం వసంతించేలోగా మరణించే ఆలోచన దేనికి?

64.

నీ సాంత్వన సంద్రాం ముందాు నా కన్నీటి అల చిన్నదే.

65.

తులసీదళాల్లా నీ జ్ఞాపకాలు బ్రతుకుభారాన్నిమరింతగా పెంచుతూ

మణి మాలికలు * రాజేష్‌ యాళ్ళ

103