పుట:Manimalikalu.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

100

26.

నలుగురక్కల్నిచంపావట నన్నైనా బైటకు రానీ నాన్నా -నీ కూతురు

27.

గుండెనిపుణుడివి నీవు ఎలా చీల్చాలో బాగా తెలుసు

28..

చీకటంటే నచ్చదా? చందామామకు కళ తెచ్చేది తనేగా

29.

నేత్రాల నైజాన్ని నిద్రాపుచ్చావు నిద్రాన్నదే వాికి మరిపించావు

30.

మువ్వలకా అందమెట్ట్గబ్బా? నీ కాలిని చుట్టే కదా

31.

నాకు వ్యాకరణం రాదు కానీ నీవే కర్తా కర్మా క్రియా

32.

దూరంగా నీవు శిశిరంగా నేను

33.

తను ముగ్గేస్తుంది బంగారు కలువల్లోంచి వెండిపొడి రాలుతున్నట్టుగా!

34.

కొత్త అత్తర్లు ఎన్నొచ్చినా తొలకరిలో మట్టివాసన తేలేవుగా

35.

ఇంకొన్ని అక్షరాలు...ఇంకొంచం భాష తెలుగుకి కావాలి...నిన్ను వర్ణించడానికి

మణి మాలికలు జ రాజేష్‌ యాళ్ళ