పుట:Mana Telugu by Bhamidipati Kameswararao.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

'రెండోభాష' మేష్టరు

“తెల్లవాళ్ళ స్కూళ్ళలో తెలుగు పద్యాలమీద ఖాతరీ లేదండి” అన్న గిరీశంమాటల్లోనూ, “ తెలుగు క్లాసటన్న తేలికగా చూచు టాంగ్ల పాఠశాలలందు గలదు ...” అనిన్నీ, “ఆంగ్ల పాఠశాల యందు దెలుగు పంతులుగ జేరు టన్న దొలిభవంపు ఎపము” అనిన్నీ ఉన్న చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి గారి మాటల్లోనూ వచ్చే 'తెల్ల', 'ఆంధ్ర' పాఠశాల లంటే తెలుగు దేశంలో ఉండే ఇంగ్లీషుబళ్ళు అనే అభిప్రాయం. కవి పండితులేకాక పామరులుకూడా దీన్ని గురించి తత్తుల్యం గానే సెలవిస్తూంటారు. తెలుగునాట ఇంగ్లీషుబర్లలో చదువు కున్న వాళ్ళు ప్రసంగాలు చేసుగు నేటప్పుడు విషయం దొల్లి దొర్లి: తమ చిన్నప్పటి తెలుగు మేష్టరుమీదికి వెడుతూంటుంది. ఒక డంటాడు: “మాకు ఓ తెలుగు మేష్ట రుండే వాడు. బహు తమాషా మనిషి. మహ మంచివాడు. అఖండ ఫండితుడు. క్లాసులో కుడా చిన్న రాగి చెంబు ఆయనచేతులో ఉండేది. ఎవరితో నేనా కాస్త మాట్టాడగానే ఆచమనం చేసేవాడు. ముసలి పండులా ఉండేవాడు. మేం 'తాత' గారు అని ఆయన్ని పిల్చే. వాళ్ళం. భాష తల్లి గనక, ఆ తల్లికి తండ్రి అవడంచేతగావును' ఆ వరస – అని ఇప్పుడు బోధపడుతోంది. బతికున్న వాడిరచన యేదీ ఆయన మెచ్చేవాడు కాడు. తనని యేమన్నా రాయ మంటే, - మన కేం వచ్చురా మన మొహం! ఆ పూర్వులమి