పుట:Mana Telugu by Bhamidipati Kameswararao.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పరీక్షలు ' 21


మారాలి. కాలం జరిగితే గాని మనస్సులు మారవు. పరీక్షల కోసం, మార్కులకోసంమాత్రమే బాధపడే వాడికి, విద్య అంటదు. విద్యకోసం పాటుపడే వాడికి పరీక్షవల్ల బాధేఉండదు. ఎంచేతంటే, వాడు ప్రతీ కొత్త సంగతీ పరీక్షవల్లే నేర్చుకోవలసిన అవసరం ఉండడంచేత, వాడికి పరీక్ష మామూలై పోతుంది. పరీక్ష నాలుగుపూటలూ ఏ అరువుముక్కలో ముక్కునెట్టుగొని తెలివి గలవాడికిమల్లే కనిపించి, ఆకాలానికి పూర్వాపరాలు మూర్ఖుడై ఉండడం మానవుడు కోరుకోకూడదు. అసలు జీవితం ఒకపెద్ద నిత్యపరీక్ష. జీవితపరీక్షకి ఎప్పుడో తయారు అవుతానులే అనడంకాక, ఎప్పటికప్పుడు తయారుగా ఉండడం మానవుడి విధి. అటువంటి ధన్యుడి జీవితం ఆదర్శం. సమస్కారం.

"మన" తెలుగు.

[6-8-1938 తారీఖున తెలుగుదేశంలో ప్రసిద్ధిచెందిన రాజమండ్రి గౌతమీ గ్రంధాలయపు 40-వ వార్షికోత్సవ సందర్భంలో ఆంధ్రవిశ్వకళాపరిషత్తు యొక్క అధ్వర్యప్రతినిధిగా రెండవసారి ఉంటూ దేశదేశాంతరాల్లో ప్రఖ్యాతులైన శ్రీ కట్టమంచి రామలింగారెడ్డి గారి అధ్యక్షతకింద జరిగినసభలో ఈ ప్రసంగం చాలా వరకు అయింది. ప్రసంగం 'మన తెలుగు' యొక్క స్థితిగతుల గురించి. 'మన' అనేమాట మన భాషలోనే ఉందిట. మనమతంలాగే మన భాషకూడా చాలా సమిష్టి కుటుంబం, చెప్పేదాల్లో తెలుగుభాష యొక్క విశేషాలుగనక మీకు స్ఫురణ