పుట:Mana-Jeevithalu.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

88

మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

చేసుకున్నట్లయితే సురక్షితంగా ఉన్నట్లనిపిస్తుంది. అందువల్లనే మనలో చాలామంది జాతీయ భావాన్ని పట్టుకుని వదలరు - అది వినాశానికీ, దుఃఖానికీ దారి తీసినా సరే. అందువల్లనే మత వ్యవస్థలకి ప్రజలపైన అంత ప్రభావం - అది విభేదాల్నీ, వైరుధ్యాన్నీ పుట్టించినా సరే. వ్యక్తిగతంగా గాని, సామూహికంగా గాని రక్షణ కోసం తాపత్రయ పడటం వినాశాన్ని కలుగ జేస్తుంది. మానసికంగా క్షేమంగా ఉండాలనుకోవడం భ్రమని కలిగిస్తుంది. మన జీవితమంతా భ్రమ, దుఃఖం; మధ్య మధ్య ప్రశాంతమైన, సంతోషకరమైన క్షణాలు అరుదుగా ఉంటాయి. అందుకని ఏవి మనకి ఆశ్రయాన్ని కల్పిస్తాయని ఆశపెట్టినా మనం వెంటనే ఒప్పుకుంటాం. కొంతమంది రాజకీయ ఆదర్శాల నిరుపయోగాన్ని చూచిన మీదట మతం వైపుకి మొగ్గుతారు - గురువుల్లోనూ, మూఢవిశ్వాసాల్లోనూ ఆదర్శల్లోనూ రక్షణనీ, సుఖాన్నీ వెతుక్కోవటానికి. నమ్మకం అనుభవాన్ని రూపొందిస్తుంది కనక గురువులు ఉన్నారనేది తప్పించుకోశక్యం కాని నిజం అవుతుంది. ఒకసారి ఐక్యం చేసుకోవటంలో ఉన్న సుఖాన్ని అనుభవించిన తరువాత మనస్సు గట్టిగా బంధింపబడి ఉంటుంది. దాన్ని కుదపటం దేనికీ తరం కాదు. దాని లక్షణమే అనుభవం.

కాని అనుభవం నిజం కాదు. నిజాన్ని అనుభవం పొందటం సాధ్యం కాదు. అది ఉంటుంది, అంతే. అనుభవించేవాడు నిజాన్ని అనుభవం పొందుతున్నావని అనుకుంటే అతనికి తెలిసినది భ్రమ మాత్రమే. నిజం గురించి ఉన్న జ్ఞానమంతా భ్రమే. నిజం ఉండాలంటే జ్ఞానం, అనుభవం అంతమొందాలి. అనుభవం నిజాన్ని చేరుకోలేదు. అనుభవం జ్ఞానాన్ని రూపొందిస్తుంది. జ్ఞానం అనుభవాన్ని మలుస్తుంది. నిజం ఉండాలంటే ఆ రెండూ అంతమవాలి.

32. ప్రత్యేకత

ఆయన పొట్టిగా ఉన్నాడు. ఉద్రేకపడే మనిషి. ఏదో విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడు. ఆయన ఎంతగా చదివాడంటే, ఆయన