పుట:Mana-Jeevithalu.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ధ్యానం

81

మొత్తం మీద అనుభవం పొందటం, అవగాహన కావటం జరగాలి. అప్పుడు కలలు, దైనందిన కార్యకలాపం, అన్నీ శూన్యమవుతాయి. తెలుసుకోవటానికి మనస్సు పూర్తిగా శూన్యం అవాలి. కాని, తెలుసుకోవటం కోసం శూన్యం కావాలని తాపత్రయ పడటం ఎడతెగని ప్రతిబంధక మవుతుంది. దాన్నికూడా పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఒక ప్రత్యేకస్థాయిలో అని కాకుండా, అనుభవం పొందాలనే తాపత్రయం పూర్తిగా నశించాలి. జరిగిన అనుభవాలతో, వాటి జ్ఞాపకాలతో అనుభవించేది తన్ను తాను పోషించు కోకుండా ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది.

మనస్సు శుద్ధికావటం ఒక్క పైపై స్థాయిలోనే కాక, కనిపించని లోతుల్లో కూడా జరగాలి. అనుభవానికి నామకరణం చేయటం, మాటలలో రూపొందించటం అంతమైతే గాని ఇది జరగటం సాధ్యం కాదు. నామకరణం శక్తిమంతం చేసి, అనుభవించేదాన్నీ, స్థిరత్వం కావాలనే కోరికనీ, జ్ఞాపకానికి ప్రత్యేకత నిచ్చే లక్షణాన్ని కొనసాగేటట్లు చేస్తుంది. నామకరణం చేయడాన్ని నిశ్శబ్దంగా తెలుసుకోవడం, దాన్ని అవగాహన చేసుకోవడం జరగాలి.నామకరణం చేయటం ఒకరికి తెలియజేయాటానికే కాదు, అనుభవానికి జీవం పోస్తూ, కొనసాగేటట్లు చేయటానికీ, అవసరమైనప్పుడు దాన్ని రప్పించి, దాని అనుభూతులను పునస్సంభవం చేసుకోవటానికీ కూడా. ఈ నామకరణం చేసే పద్ధతి అంతమొందాలి - పైపై స్థాయిల్లోనే కాక, మనస్సు యొక్క నిర్మాణ క్రమం అంతటిలోనూ అంతమొందాలి. ఇది చాలా శ్రమతో కూడిన పని. అర్థం చేసుకోవటం, అనుభవం పొందటం అంత సులభం కాదు. ఎందువల్లనంటే, మన చైతన్య ప్రక్రియ అంతా - పేరు పెట్టటం, అనుభవాన్ని మాటల్లో చెప్పటం, తరువాత దాన్ని పదిలపరచటం. ఈ ప్రక్రియే, అనుభవం పొందబడినది కాక వేరే అనుభవించేది ఒకటి ఉన్నదన్న భ్రమని పోషించి శక్తివంతం చేస్తుంది. ఆలోచనలు లేకుండా ఆలోచించేది ఉండదు. ఆలోచనలే ఆలోచించేదాన్ని సృష్టిస్తాయి. ఆలోచించేది తన్నుతాను ప్రత్యేకించుకుంటుంది. తనకొక స్థిరత్వాన్ని ఇచ్చుకోవటం కోసం. ఎందుకంటే, ఆలోచన లెప్పుడూ అస్థిరమైనవే.

మొత్తం జీవనాన్ని, పైపైనే కాక లోలోపల కూడా గతాన్ని శుద్ధి