పుట:Mana-Jeevithalu.pdf/88

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
79
ధ్యానం

తిరగనూలేదు. ఇన్ని సంవత్సరాల తరవాత ఆయన తన మనస్సుని అదుపులో పెట్టుకోగలుగుతున్నప్పటికీ అప్పుడప్పుడు అది అదుపులో లేకుండా పోతోందని చెప్పాడాయన. ధ్యానంలో ఆనందం కలగటం లేదుట. తనపై తాను విధించుకున్న ఆ క్రమశిక్షణ ఆయన్ని కఠినంగానూ, నిస్సారంగానూ చేస్తోందిట. మొత్తంమీద అదంతా చాలా అసంతృప్తికరంగా ఉందిట. ఆయన మత సమాజాలనబడే ఎన్నో వాటిల్లో చేరాడుట. అయితే, ఇప్పుడు అవన్నీ ఆఖరు చేసుకుని తనంతట తనే ఆ దైవాన్ని, వాళ్లంతా ఆశపెట్టిన దాన్ని స్వతంత్రంగా అన్వేషిస్తున్నాడుట. వయస్సు పైబడుతోంది. అలిసిపోతున్నట్లనిపించటం మొదలైందిట.

మనస్సుని శుద్ధి చేయటానికి సరియైన ధ్యానం అవసరం. ఎందువల్లనంటే, మనస్సుని శూన్యంగా చేయకుండా పునఃసృష్టి సాధ్యంకాదు. కేవలం కొనసాగుతూ ఉండటం పతనావస్థే. నిరంతరం పునశ్చరణతో, తప్పుడు ప్రయోగం వల్ల కలిగే ఘర్షణతో, మందకొడిగా, నిస్సత్తువగా చేసే అనుభూతులతో మనస్సు క్రమంగా క్షీణించిపోతుంది. మనస్సుని అదుపులో పెట్టటం ముఖ్యంకాదు. మనస్సుకి వేటిపైన ఆసక్తిపోతున్నదో కనుక్కోవటం ముఖ్యం. మనస్సు పరస్పర విరుద్ధమైన ఆసక్తుల సమూహం. ఒక ఆసక్తిని కాదని, మరొక ఆసక్తిని బలపరచటాన్నే ఏకాగ్రత అంటున్నాం. అదే క్రమశిక్షణా పద్ధతి. ప్రతిఘటించటానికి సాధన చేయటమే క్రమశిక్షణ. ప్రతిఘటన ఎప్పుడైతే ఉందో అప్పుడు అవగాహన ఉండదు. క్రమశిక్షణ పొందిన మనస్సు స్వేచ్ఛలేని మనస్సు. స్వేచ్ఛ ఉన్నప్పుడే దేన్నైనా కనుక్కోవటం సాధ్యమవుతుంది. తనలోని సంచలనాలన్నిటి ముసుగూ తొలగించి చూడటం. ఏ స్థాయిలో ఉన్నవాటినైనా కనుక్కోవటం అప్రయత్నంగా ప్రేరణ లేకుండా జరగాలి. ఆ కనుక్కున్నవి సంతోషదాయకమైనవి కాకపోయినా, తనలోని సంచలనాలన్నిటినీ ఆవిష్కరించి అవగాహన చేసుకోవాలి. కాని క్రమశిక్షణలన్నీ ప్రేరణ రహితమైన ఆవిష్కరణలు జరగకుండా చేస్తాయి. క్రమశిక్షణలు ఎంత నిర్దిష్టమైనవైనప్పటికీ మనస్సుని ఒక చట్రంలో బిగిస్తాయి. మనస్సు తను పొందిన శిక్షణవల్ల దానికి తగినట్లుగా సర్దుకుంటుంది. కాని, అది దేనితో సర్దుబాటు చేసుకుంటుందో అది నిజమైనది కాదు. క్రమశిక్షణలు కేవలం