పుట:Mana-Jeevithalu.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

74

మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

సంగీతం వరకూ అంతు లేకుండా వినొచ్చు. రహస్య పరిశోధక నాటకాలూ, వార్తలూ వంటివి నిరంతరం ప్రసారమైన వన్నీ వినొచ్చు. ఎవరితోనూ సంభాషించనక్కర్లేదు. ఒకరి ఆలోచన లొకరికి చెప్పుకోనక్కర్లేదు. మీక్కావలిసినవన్నీ రేడియో చేసి పెడుతుంది. విద్యార్థులు చదువుకోవటంలో కూడా రేడియో తోడ్పడుతుందట. పాలు పిండేటప్పుడు ఆవులికి రేడియో వినిపిస్తే పాలు ఎక్కువిస్తాయట.

ఇందులో అన్నిటికన్నా చిత్రమైన విషయమేమిటంటే రేడియో మన జీవన విధానంలో తెచ్చే మార్పు ఎంత స్వల్పమోనన్నది. కొన్ని విషయాల్లో మరికొంచెం వీలుగా ఉండేట్లు చేస్తూ ఉండి ఉండవచ్చు. ప్రపంచ వార్తల్ని మనకి అతి త్వరగా లభ్యం చేయవచ్చు. హత్యల్ని గురించి ఎంతో వివరంగా వర్ణించి చెప్పవచ్చు. కాని, సమాచారం మనల్ని వివేకవంతుల్ని చెయ్యబోదు. అణ్వాయుధాల ప్రయోగం కలిగించే భీభత్సం గురించీ, అంతర్జాతీయ సంబంధ బాంధవ్యాల గురించీ. ఆకులలోని ఆకుపచ్చ రంగు లక్షణాల పైన పరిశోధన గురించీ, ఇటువంటి వాటి గురించి సమాచారం మన జీవితాల్లో తెచ్చిన ముఖ్యమైన మార్పు ఏమీ లేనట్లే తోస్తుంది. మన యుద్ధ మనస్తతత్వం ఎప్పటిలాగే ఉంది. ఇతర జనాన్ని మనం అసహ్యించుకుంటున్నాం. ఒక రాజకీయ నాయకుని ద్వేషిస్తున్నాం. మరొకరికి చేయూతనిస్తున్నాం. మత సంస్థల వల్ల మోసపోతున్నాం. మనం జాతీయ వాదులం. మన దుఃఖాలూ అలాగే కొనసాగుతున్నాయి. వాటిని తప్పించుకోవాలని మనకింకా పట్టుదల. అ తప్పించుకునే మార్గాలు ఎంత గౌరవప్రదమైనవీ, ఎంత క్రమ బద్ధమైనవీ అయితే అంత మంచిది. సామూహికంగా తప్పించుకోవటం అత్యుత్తమమైన రక్షణ మార్గం. ఉన్న దాన్ని ఎదుర్కొన్నట్లయితే మనం చెయ్యగలిగినది కొంతైనా ఉంటుంది కాని, ఉన్న స్థితి నుంచి ఎగిరిపోయి తప్పించుకోవటం వల్ల మనం తెలివితక్కువగా, మందకొడిగా, అనుభూతులకూ, సందిగ్ధతకీ బానిసలుగా తయారవటం అనివార్యం.

ఉన్న దాన్నుంచి హాయిగా తప్పించుకునే సూక్ష్మమార్గాన్నివ్వటం లేదూ సంగీతం? మంచి సంగీతం మన నుంచి మనల్ని ఎంతో దూరానికి తీసుకుపోతుంది. ఈ దైనందిన దుఃఖాలకీ, అల్పత్వానికీ, ఆదుర్దాలకీ దూరంగా