పుట:Mana-Jeevithalu.pdf/82

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
73
రేడియో, సంగీతం

అనుభవం పొందటం జరుగుతుంది.

అనుభవం మళ్లీ సంభవించాలని కోరటం అనుభూతి యొక్క తీవ్ర లక్షణం. జ్ఞాపకాలను పెంపొందించుకోవటం, అనుభూతులను విస్తృతం చేసుకోవటమే. అనుభవం మళ్లీ సంభవించాలనే కోరిక - మీ అనుభవం అయినా, మరొకరి అనుభవమైనా సరే - బండబారేటట్లు చేస్తుంది. మరణానికి దారితీస్తుంది. పునశ్చరణ అయిన సత్యం అబద్ధమవుతుంది. సత్యం పునస్సంభవం కాదు. దాన్ని ప్రచారం చేయటానికి గాని, ఉపయోగించు కోవటానికి గాని వీలులేదు. సత్యాన్ని నాశనం చేసిగాని, కాదని గాని, మళ్లీ దాన్ని ఉపయోగించవచ్చు. కాని, అది ఇంక సత్యం అవదు. ప్రచారకులకు అనుభవం పొందటంతో ప్రమేయం లేదు. వారికి కావలసినదల్లా అనుభూతులను - మత, రాజకీయ, సాంఘిక, అంతరంగిక అనుభూతులను సమకూర్చటమే. ప్రచారకులు మతాన్ని ప్రచారం చేసినా, లౌకిక వాదాన్ని ప్రచారం చేసినా సత్యాన్ని చెప్పేవారు మాత్రం కాదు.

అనుభూతి పైన అభిలాష అంతమైనప్పుడే అనుభవం పొందటం సంభవమవుతుంది. పేరు పెట్టటం, మాటల్లో చెప్పటం అంత మొందాలి. మాటల రూపంలో పెట్టకుండా ఆలోచనా ప్రక్రియ జరగదు. మాటలలో చిక్కుకోవటం కోరికల భ్రమలలో బంధింపబడటమే.

27. రేడియో, సంగీతం

రేడియో సంగీతం తప్పించుకునేందుకొక అద్భుతమైన మార్గం అని స్పష్టమవుతోంది. పక్కింటివాళ్లు దాన్ని రోజంతా పెట్టుకోవటమే కాక, రాత్రి చాలా సేపటివరకూ పెట్టి ఉంచుతారు. తండ్రి చాలా తొందరగా ఆఫీసుకి వెళ్లిపోతాడు. తల్లీ, కూతురూ ఇంట్లోనూ, తోటలోనూ పనిచేస్తూ ఉంటారు. వాళ్లు తోటలో పని చేస్తున్నంత సేపూ రేడియో గట్టిగా మోగుతూనే ఉంటుంది. కొడుక్కి కూడా ఆ సంగీతం, ప్రచార కార్యక్రమాలూ ఇష్టంలానే కనిపిస్తుంది. అతను ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఆ రేడియో అలా మోగుతూనే ఉంటుంది. రేడియోలో అన్ని రకాల సంగీతాన్నీ, శాస్త్రీయ సంగీతం నుంచి సరికొత్త