పుట:Mana-Jeevithalu.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భోగభాగ్యాలను త్యజించటం

67

పోల్చి చూడటం అంతా ఆగిపోతుంది. ఆ నిశ్శబ్దం అంతం అయేదీ, మళ్ళీ మొదలయేదీ కాదు. మళ్ళీ అదేవిధంగా జరగటం ఉండదు. కపటమైన మనస్సు వేసే టక్కరి వేషాలు ఎక్కడా ఉండవు.

ఈ నిశ్శబ్దం భ్రమే అయినట్లయితే మనస్సుకీ, దానికీ సంబంధం ఉండి ఉండేది. దాన్ని కాదనటమో, దాన్ని పట్టుకు వ్రేళ్ళాడటమో, దాన్ని సహేతుకంగా చెప్పటమో, లేదా, పైకి కనిపించకుండా తృప్తిపడి దానితో సమైక్యం కావటమో చేసేది. ఈ నిశ్శబ్దంతో దానికి ఎటువంటి సంబంధమూ లేదు కనుక మనస్సు దాన్ని అంగీకరించటమూ లేదు, కాదనటమూ లేదు. మనస్సు తనలోంచి వచ్చిన వాటిపైన, తన రూపకల్పనల పైనే పని చేయగలదు. తాను పుట్టించని వాటితో దానికి సంబంధము ఉండదు. ఈ నిశ్శబ్దం మనస్సులోంచి వచ్చినది కాదు. అందువల్ల మనస్సు దాన్ని అలవాటు చేసుకోవటం గాని, దానితో సమైక్యత పొందటంగాని చెయ్యలేదు. ఈ నిశ్శబ్దంలో ఉన్నదాన్ని మాటలతో కొలవటానికి వీలులేదు.

25. భోగభాగ్యాలను త్యజించటం

ఒక పెద్ద చెట్టు నీడలో కూర్చున్నాం మేము. అక్కడ నుంచి లోయ ఆకుపచ్చగా కనబడుతోంది. వడ్రంగి పిట్టలు తమ పనిలో మునిగి ఉన్నాయి. రెండు చెట్ల మధ్య చీమలు బారులు తీర్చి ముందుకీ వెనక్కీ చకచకా పోతున్నాయి. సముద్రపుగాలి దూరంగా ఉన్న పొగమంచు వాసనని మోసుకొస్తుంది. కొండలు నీలంగా కలలో మాదిరిగా ఉన్నాయి. తరుచు అవి ఎంతో దగ్గరగా ఉన్నట్లు కనిపించేవి. కాని, ఇప్పుడవి ఎంతో దూరంగా ఎక్కడో ఉన్నాయి. చిన్న పిట్ట ఒకటి పైపులోంచి కారి ఏర్పడిన చిన్ననీటి మడుగులోంచి నీళ్లు తాగుతోంది. రెండు బూడిదరంగు ఉడతలు పెద్ద కుచ్చుల్లాంటి తోకలతో, ఒకదాన్ని ఒకటి తరుముకుంటూ చెట్టు మీద పైకీ క్రిందికీ తిరుగుతున్నాయి. బాగా పైదాకా పాకి, మళ్లీ గిర్రున తిరిగి వెర్రివేగంతో దాదాపు నేలదాకా దిగిపోయి, మళ్ళీ పైకి పోతున్నాయి.

ఆయన ఒకప్పుడు బాగా ధనమున్నవాడు. తన భోగభాగ్యాలను