పుట:Mana-Jeevithalu.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

66

మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

ఎటువంటి జ్ఞాపకమూ లేదు మనస్సులో. "ఇదీ ప్రశాంతత" అనలేదు మనస్సు. దాన్ని మాటల్లోకి రూపొందించలేదు. మాటల్లోకి రూపొందించట మంటే అటువంటిదే మరొక అనుభవాన్ని గుర్తుతెచ్చుకొని ఇది కూడా అటువంటిదేనని నిశ్చయించటం. మాటలలోకి రూపొందించటంలేదు. కాబట్టి ఆలోచన లేదు. దానికొక స్థిర రూపాన్నివ్వటం లేదు కాబట్టి ఆలోచన ఆ నిశ్శబ్దాన్ని అందుకొని దాన్ని గురించి ఆలోచించలేకపోయింది - "నిశ్శబ్దం" అనేమాట నిశ్శబ్దం కాదు కనుక. మాటలేనప్పుడు మనస్సు పనిచేయలేదు. అందుచేత అనుభోక్త దాన్ని మరికొంత సుఖాన్ని అనుభవించే సాధనంగా దాచుకోలేడు. కూడబెట్టాలనే ప్రక్రియ జరగటం లేదు. పోల్చి చూడటంగాని, అంతర్లీనం చేసుకోవటంగాని లేదు. మనస్సు యొక్క సంచలనమే లేదు.

కారు ఇంటిదగ్గర ఆగింది. కుక్క మొరగటం గాని, కారులోంచి సామాను దించటంగాని, ఆ మొత్తం గొడవగాని ఏవిధంగానూ ఈ అసాధారణమైన నిశ్శబ్దాన్ని భంగపరచలేదు. అసలు గొడవ లేనేలేదు. నిశ్శబ్దం కొనసాగుతూనే ఉంది. దేవదారు చెట్ల మధ్య గాలివీస్తోంది. వీటి నీడలు పొడుగ్గా పడుతున్నాయి. ఓ అడవి పిల్లి పొదలమాటున దూరి పోయింది. ఈ నిశ్శబ్దంలో సంచలనం ఉంది. ఆ సంచలనం ధ్యానభంగం కలిగించటం లేదు. దేని మీదా ప్రత్యేకమైన ధ్యానం లేదు, అందువల్లనే దేనికీ ధ్యానభంగం కావటంలేదు. ఒక ముఖ్యమైన దాన్నుంచి ఆసక్తి మళ్ళినప్పుడే ధ్యానభంగం అవుతుంది. కాని ఈ నిశ్శబ్దంలో దేనిపైనా ఆసక్తి లేదు. అందువల్ల ఇటూ అటూ ఊరికే తిరగటం లేదు. ఆ సంచలనం నిశ్శబ్దానికి దూరంగా లేదు. ఆ నిశ్శబ్దంలోనిదే. అది మరణంలో ఉండే నిశ్చలతకాదు, క్షీణదశలో ఉండేది కాదు. సంఘర్షణ ఏమాత్రం లేకుండా ఉండేది. మనలో చాలామందికి సుఖదుఃఖాల పోరాటం, కార్యాతురతా మనజీవితానికి అర్ధాన్నిస్తాయి. ఆ ఆత్రుతని తీసి పారవేస్తే మనం దిక్కులేని వారమై అతి త్వరలో నాశనమై పోతాం. కాని, ఈ నిశ్చలత, ఈ సంచలనం నిత్యనూతన సృష్టి. ఈ సంచలనానికి ఆదిలేదు. అందువల్ల అంతం కూడాలేదు. కొనసాగటం అనేది లేదు. సంచలనం కాలంతో సంబంధించినట్లు ఉంటుంది. కాని కాలం లేదు. కాలం అంటే ఎక్కువ, తక్కువ, దగ్గర, దూరం, నిన్న, రేపు. కాని, ఈ నిశ్చలతలో