పుట:Mana-Jeevithalu.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నిశ్శబ్దం

65

కాని, రాజకీయ సంబంధమైనది కాని, ఏవిధమైన నమ్మకమైనా సంబంధ బాంధవ్యాలను అవగాహన చేసుకోవటానికి ఆటంకం కలిగిస్తుంది. అవగాహన లేనిదే కార్యాచరణ సాధ్యంకాదు.

24. నిశ్శబ్దం

ఆ కారు ఇంజను మంచి శక్తిమంతంగా, అవసరానికి తగినట్లుగా ఉంది. కొండలమీదకు సునాయాసంగా పోతోంది. ఏచప్పుడూ లేకుండా అద్భుతంగా పుంజుకుంటోంది. లోయ దాటిన తరవాత పైకి వెళ్లేదారి నిటారుగా ఉంది. నారింజ తోటల మధ్యనుంచీ, ఎత్తుగా విశాలంగా పెరిగిన అక్రోటుచెట్ల మధ్య నుంచీ పోతోంది. దారి కిరుప్రక్కలా నలభైమైళ్ళ పొడుగున కొండదిగువదాకా విస్తరించి ఉన్నాయి తోటలు. ఆ దారి ఒకటి రెండు చిన్న గ్రామాల మధ్యనుంచి కూడా విశాలమైన పొలాల్లో పచ్చగా నిగనిగలాడే సెనగచేల మధ్య నుంచి సాగింది. మళ్ళీ ఎన్నో కొండల మధ్య మెలికలు తిరుగుతూ చివరికి ఆదారి ఎడారిలోకి వచ్చింది.

ఆ రోడ్డు నున్నగా ఉంది. కారు ఇంజను చప్పుడు తడబాటు లేకుండా స్థిరంగా ఉంది. రద్దీ చాలా తక్కువగా ఉంది. అన్నిటినీ తీవ్రంగా గమనించటం జరుగుతోంది - ఆ ప్రదేశాన్ని మధ్యమధ్య పక్కనుంచి వెళ్లేకారునీ, రోడ్డు సిగ్నల్సునీ, నిర్మల నీలాకాశాన్నీ, కారులో కూర్చున్న శరీరాన్నీ. కాని, మనస్సు మాత్రం నిశ్చలంగా ఉన్నది. అలసటవల్ల ప్రశాంతంగా ఉండటంకాదు, విశ్రాంతి తీసుకోవటంవల్లనూ కాదు. చురుకుతనంతో కూడిన నిశ్చలత అది. మనస్సు నిశ్చలంగా ఉన్నది ఏ కేంద్రం నుంచీ కాదు. ఆ ప్రశాంతతని గమనించే వాడెవడూ లేడు. అనుభవించేవాడు లేనే లేడు. ఏవో అనేక విషయాల మీద సంభాషణ జరుగుతున్నా, ఈ నిశ్శబ్దంలో ఒక్క అల అయినాలేదు. కారు దూసుకుని పోతూంటే రివ్వున వీచే గాలి శబ్దం వినిపిస్తోంది. కాని ఈ నిశ్శబ్దం ఆ గాలి శబ్దాన్నుంచిగాని, కారు చప్పుళ్ళనుంచి గాని, మాట్లాడుతున్న మాటలనుంచి గాని వేరు చేయరానిది. ఇంతకు ముందు ఇటువంటి నిశ్శబ్దం గురించిగాని తెలిసిన వేరే నిశ్శబ్దాల గురించి గాని