పుట:Mana-Jeevithalu.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

62

మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

ఆటంకం కలుగుతుంది. ఆ శూన్యతని అనుభవించాలనే కోరిక ఉన్నప్పుడు, లేదా ఆ శూన్యతని అధిగమించాలని, దానిని దాటి పోవాలనుకున్నప్పుడు, అప్పుడు అనుభవం పొందటం కుదరదు, ఎందుచేతనంటే, అహం ఒక వ్యక్తిత్వంతో కొనసాగుతూనే ఉంటుంది కనుక. అనుభోక్తకి (అనుభవించేదానికి) అనుభవం కలిగినప్పుడు అది అనుభవం పొందటం అనేస్థితి కాదు. ఉన్నదాన్ని ఫలానా అని పేరు పెట్టకుండా అనుభవం పొందటం జరిగితేనే, ఆ ఉన్నదాన్నుంచి స్వేచ్ఛ లభిస్తుంది.

23. నమ్మకం

మేము బాగా పైన కొండల్లో ఉన్నాం. చాలా ఎండగా ఉంది. ఎన్నో నెలల నుంచీ వర్షం పడలేదు. చిన్న చిన్న నీటి ప్రవాహాలు నిశ్శబ్దంగా పోతున్నాయి. దేవదారు చెట్లు మట్టి రంగుకి తేలిఉన్నాయి. కొన్ని అప్పటికే చచ్చిపోయాయి. వాటి మధ్య నుంచి గాలి వీస్తోంది. కొండలు మడతలన్నీ విప్పుకుని అనంతంగా విస్తరించినట్లుగా ఉన్నాయి. అడవి జంతువులు చాలావరకు మరింత సౌకర్యవంతమైన చల్లని ప్రదేశాలకు వెళ్లిపోయాయి. కొన్ని ఉడతలూ, పాలపిట్టలూ మాత్రం ఉండిపోయాయి. వేరే కొన్ని చిన్ని పక్షులున్నాయి. కాని, అవి రోజంతా నిశ్శబ్దంగా ఉంటున్నాయి. చచ్చిపోయిన దేవదారు చెట్టొకటి ఎండలకి ఎండి ఎండి, తెల్లబడి పోయింది. చచ్చిపోయినా ఎంతో అందంగా ఉందది, ఎటువంటి సంచలనం లేకుండా నాజూగ్గానూ బలంగానూ ఉంది. నేల గట్టిపడి, నడిచేదారులు రాళ్లతోనూ, మట్టితోనూ నిండి ఉన్నాయి.

ఆవిడ ఎన్నో మత సమాజాల్లో చేరినట్లు చెప్పింది. ఆఖరికి ఒక దాంట్లో స్థిరపడి పోయిందిట. దానికోసం ఆవిడ ఉపన్యాసకురాలిగా, ప్రచారిణిగా పని చేసిందిట దాదాపు ప్రపంచమంతటా. ఆవిడ తన సంసారాన్నీ, సౌఖ్యాన్నీ మరెన్నిటినో ఈ సంస్థకోసం వదులుకున్నదిట. దాని నమ్మకాలనూ సిద్ధాంతాలనూ, ఉద్దేశాలనూ స్వీకరించి, దాని అధినాయకులను అనుసరించి ధ్యానం చేయటానికి ప్రయత్నించిందిట. సభ్యులచేతా, అధినాయకులచేతా