పుట:Mana-Jeevithalu.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వ్యక్తి, సమాజం

57

నేర్పటం సాధ్యంకాదు. వివేకం స్వేచ్ఛలోనే సాక్షాత్కరిస్తుంది.

సామూహిక ఇచ్ఛ, దాని కార్యాచరణ - ఇదే సమాజం అంటే, సమాజం వ్యక్తికి స్వాతంత్ర్యాన్ని ప్రసాదించదు. అది జీవం, చలనం లేనిది కాబట్టి సమాజం వ్యక్తికి సానుకూల పడేందుకే ఏర్పడింది. దానికి సొంత రూపం అంటూ ఏమీ లేదు. మనుషులు సమాజాన్ని వశం చేసుకుని, దానికి మార్గం చూపించి, దాన్ని రూపొందించి దానిపైన నిరంకుశత్వం వహించవచ్చు, వారి వారి మనస్థితిని బట్టి. కాని సమాజం మనిషికి అధిపతి కాదు. మనిషిని ప్రభావితం చెయ్యవచ్చు, కాని మనిషి దాన్ని ఎప్పుడూ ఖండిస్తాడు. మనిషికీ సమాజానికీ మధ్య సంఘర్షణ ఎందుకున్నదంటే మనిషి తనలో తానే ఘర్షణ పడుతున్నాడు కాబట్టి, స్థిరమైనదానికీ, సజీవమైనదానికీ మధ్య సంఘర్షణ. వ్యక్తి బాహ్యరూపమే సమాజం. అతనికీ, సమాజానికీ మధ్యనున్న సంఘర్షణ అతనిలో అంరర్గతంగా ఉన్న సంఘర్షణే. అత్యున్నతమైన వివేకం మేలుకునేంతవరకూ ఈ సంఘర్షణ అంతర్గతంగానూ బహిరంగంగానూ ఉండి తీరుతుంది.

మనం సంఘజీవులమే కాక వ్యక్తులం కూడా. మనం ప్రజలమే కాక మనుషులం కూడా. సుఖదుఃఖాలకు రెండు విధాలా లోనవుతాం. శాంతి ఉండాలంటే మనిషికీ పౌరుడికీ మధ్య ఉండే సరియైన సంబంధాన్ని అర్థం చేసుకోవాలి. మనం పూర్తిగా పౌరులుగానే ఉండాలని ప్రభుత్వం కోరుతుంది. అది ప్రభుత్వం తెలివితక్కువతనమే. అయితే మనం కూడా మనిషిని పౌరుడి చేతికి అప్పజెప్పడానికి ఇష్టపడతాం. ఎందుచేతనంటే, మనిషిగా ఉండటం కన్న పౌరుడిగా ఉండటం సులభం. మంచి పౌరుడిగా ఉండటమంటే అమలులో ఉన్న సాంఘిక పద్ధతి ప్రకారం సమర్థతతో పనిచెయ్యడమే. సామర్థ్యం, పద్ధతి ప్రకారం నడుచుకోవడం - ఈ రెండూ పౌరుడికి ఉండి తీరాలి. వాటివల్లనే అతడు రాటుదేలి నిర్దయుడిగా తయారై, మనిషిని పౌరుడికోసం, త్యాగం చెయ్యగలుగుతాడు. మంచి పౌరుడు మంచి మనిషి అయి ఉండాలని లేదు. కాని మంచి మనిషి అయి ఉంటే అతడు సరియైన పౌరుడు అయితీరుతాడు, ఒక ప్రత్యేక సమాజానికీ, ఒక ప్రత్యేక దేశానికీ చెందిన వాడుగా కాదు. అతడు ప్రప్రథమంగా మంచి మనిషి కనుక అతని