పుట:Mana-Jeevithalu.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సున్నితత్వం

53

రాకండి. ఆరంభించండి. ఆత్మజ్ఞానం మీ సంబంధ, బాంధవ్యాల్లోనే ఆవిష్కరింపబడుతుంది. కావాలని ఒంటరిగా ఉండటంతోనూ, ఎవ్వరితోనూ కలవకుండా వేరుగా ఉండటంతోనూ ఆత్మజ్ఞానం కలగదు. సంబంధ బాంధవ్యాలను వదులు కోవటం అంటే మరణించటమే. మరణం అంతిమ ప్రతిఘటన. ప్రతిఘటించటం, అణచివేయటం, దాని స్థానంలో మరొకటి ప్రతిష్ఠించటం, ఆరాధించటం, ఏరూపంలోనైనా ఆత్మజ్ఞానానికి ప్రతిబంధకాలే. ప్రతిఘటన కనిపించనిదైనా, కనిపించేదైనా, పోల్చటాలూ, సమర్ధింపులూ, ఖండించటాలూ, ఐక్యత వ్యక్తపరచటాలూ - ఇదంతా ఉన్నదాన్ని కాదనటమే. అర్ధమంతా ఉన్నదాంట్లోనే ఉంటుంది. అందులో ఉన్న అర్థాన్ని ఏ పక్షమూ వహించకుండా గ్రహించటమే దాని ఆవిష్కరణ. ఈ ఆవిష్కరణే వివేకానికి నాంది. అపరిచితమైనదీ, అనంతమైనదీ సిద్ధించటానికి వివేకం అవసరం.

20. సున్నితత్వం

అ తోట రమణీయంగా ఉంది. మెత్తని పచ్చగడ్డితో మైదానాలు; నీడ నిచ్చే పురాతన వృక్షాలూ. ఆ ఇల్లు చాలా పెద్దది - విశాలమైన గదులు గాలీ, వెలుతురుతో మంచి తీరుగా ఉన్నాయి. ఆ చెట్లలో ఎన్నో పక్షులు గూళ్లుకట్టుకున్నాయి. బోలెడు ఉడతలున్నాయి. ఫౌంటెన్ చుట్టూ ఎన్నో పక్షులు - పెద్దవీ, చిన్నవీ, గ్రద్దలూ, కాకులూ, పిచుకలూ, గొడవ చేసే చిలకలూ. అ ఇల్లూ, తోటా కూడా వేటితోనూ సంబంధం లేకుండా వేరుగా ఉన్నాయి - ముఖ్యంగా, వాటి చుట్టూ ఎత్తైన తెల్లని ప్రహరీ గోడలు ఉండటం వల్ల. ఆ గోడలకు లోపలవైపు బాగుంటుంది. బయట రోడ్డు మీంచీ, పల్లెలోంచీ వచ్చే శబ్దాలు. ఆ ఇంటి గేటు ముందు నుంచే వెడుతుంది రోడ్డు. ఆ రోడ్డమ్మట కొన్ని గజాలు పోతే ఒక పల్లె ఉంది, ఒక పెద్ద పట్టణం శివార్లలో. పల్లె దుర్గంధ భూయిష్టంగా ఉంది. ముఖ్యమైన ఇరుకు సందుకి రెండువైపులా కుళ్లు కాలవలు. అక్కడున్నవి పూరిళ్లు. ఇళ్లముందు ముగ్గులు వేసి ఉన్నాయి. పిల్లలు సందులో ఆడుకుంటున్నారు. సాలెవాళ్లు కొందరు చక్కని