పుట:Mana-Jeevithalu.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సత్యాన్వేషణ

51

కనిపించాలని వెతికితే, మీకు కనిపించేది మీ స్వీయ ప్రతిరూపమే. మీరు కోరేదే మీకు కనిపిస్తుంది. సత్యం కోరిక సృష్టించినది కాదు. సత్యాన్ని అన్వేషించటం దాన్ని పోగొట్టుకోవటానికే. సత్యానికి స్థిర స్థావరం లేదు. దానికి మార్గంలేదు. మార్గదర్శకమైనది లేదు. మాట సత్యం కాదు. సత్యం ఏదో ప్రత్యేకంగా అమర్చిన స్థలంలోనూ, ఏదో ప్రత్యేక వాతావరణంలోనూ, ఎవరో ప్రత్యేకమైన వారిలోనూ కనిపిస్తుందా? ఇక్కడ ఉంది, అక్కడ లేదనా? సత్యానికి ఒకటి మార్గదర్శకము, మరొకటి కాదు అనా? అసలు మార్గదర్శకమైనది ఉన్నదా? సత్యాన్ని అన్వేషించినప్పుడు కనిపించేది అజ్ఞానం వల్ల ఉద్భవించినదే. ఎందుకంటే, అన్వేషణ అనేదే అజ్ఞానంలో పుట్టినది. సత్యాన్ని అన్వేషించలేరు. 'మీరు' లేనప్పుడే 'సత్యం' ఉంటుంది.

"అయితే ఆ పేరు లేని దాన్ని నేను కనుక్కోలేవా? నేను ఈ దేశానికి వచ్చినదే అందుకు - ఇక్కడ అటువంటి అన్వేషణా భావం ఎక్కువగా ఉంటుందని. భౌతికంగా ఇక్కడ ఎక్కువ స్వేచ్ఛగా ఉండటానికి వీలుంటుంది. అక్కడ కావలసినన్ని వస్తువులు ఇక్కడ అవసరం ఉండదు. ఇతర చోట్లలో లాగ సంపాదించిన వాటన్నిటికీ దాసోహం చెయ్యనక్కరలేదు. కొంతవరకు అదే కారణం అయి ఉంటుంది, కొందరు మఠాల్లో చేరటానికి. కాని మఠానికి వెళ్ళిపోవటంలో మానసికంగా పారిపోవటం లాంటివి ఉంటాయి. అటువంటి క్రమబద్ధమైన ఒంటరితనంలోకి పారిపోవాలని లేదు నాకు. నా బ్రతుకు నేను బ్రతుకుతూ ఆ నామరహితమైన దానిని కనుక్కోవాలనే నేనిక్కడికి వచ్చాను. కనుక్కోగల శక్తి నాలో ఉందంటారా?"

అది శక్తికి సంబంధించిన విషయమా? శక్తి అనగానే ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని అనుసరించ గలగటం అని స్ఫురిస్తుంది. ఒక నిర్ణీత మార్గాన్ని అవసరమైన సర్దుబాట్లన్నీ చేసుకుంటూ అవలంబించటమా? మీరు ఆ ప్రశ్న అడుగుతున్నప్పుడు, ఒక సామాన్యవ్యక్తిలా మీరు కోరుకున్నదాన్ని పొందటానికి అవసరమైనవన్నీ మీ వద్ద ఉన్నవా అని అడగటం లేదా? నిజానికి, మీ ప్రశ్నలో ఉద్దేశం, ఎవరో అసాధారణ వ్యక్తులే సత్యాన్ని కనుక్కోగలరనీ, అది సామాన్య మానవుడికి సాధ్యం కాదనీను. సత్యం కొందరికి మాత్రమే. కేవలం అసాధారణమైన మేధావులకు మాత్రమే ప్రాప్తమవుతుందనా? మనకా శక్తి