పుట:Mana-Jeevithalu.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సంబంధ బాంధవ్యాల్లో ప్రేమ

43

నప్పుడూ కాలాతీతమైనదీ, కారణ ఫలితాల పరిమితికి అతీతమైనదీ సిద్ధిస్తుంది.

17. సంబంధ బాంధవ్యాల్లో ప్రేమ

ఆ దారి పొలం ప్రక్కనుంచే పోయి, కొండమీదుగా వెడుతుంది. దాని కెదురుగుండా ఇళ్లూ, ఆవులూ, ఆవుదూడలూ, కోళ్లూ, గుర్రాలూ, బోలెడు వ్యవసాయ యంత్రాలూ కనిపిస్తాయి. అడవుల్లోంచి వెళ్ళే ఆ దారి ఎంతో బాగుంటుంది. లేళ్లూ, ఇతర వన్యమృగాలు అటు వెడుతూ ఉంటాయి తరుచుగా. వాటి అడుగుల ఆనవాళ్ళు మెత్తని మట్టి మీద ఇక్కడ, అక్కడ కనిపిస్తున్నాయి. అక్కడ నిశ్శబ్దంగా ఉన్నప్పుడు పొలంలోంచి కంఠధ్వనులూ, నవ్వులూ, రేడియో శబ్దాలూ చాలా దూరం వరకూ వినిపిస్తూ ఉంటాయి. అ పొలంలో బాగా పనిసాగుతున్నట్లుంది. తీర్చిదిద్దినట్లు శుభ్రంగా ఉంది. తరచు వాళ్ల గొంతులు కోపంతో అరుస్తున్నట్లు గట్టిగా వినిపిస్తాయి. దాంతో, పిల్లలు చడీచప్పుడు లేకుండా అయిపోతారు. చెట్ల మధ్యనుంచి ఏదో పాట వినిపిస్తోంది. కోపంతో వాళ్లు అరిచిన అరుపులకి పాట శబ్దం అణగిపోయింది. హఠాత్తుగా ఒక స్త్రీ ఇంట్లోంచి బయటికి వచ్చింది; తలుపు ధడాలున వేసి, దూడల పాక దగ్గరికి వెళ్ళి ఒక - ఆవుని బెత్తం పుచ్చుకుని కొట్టటం మొదలు పెట్టింది. ఆ బెత్తం చప్పడు కొండ పైదాకా వినిపిస్తోంది.

మనం ప్రేమించేదాన్ని నాశనం చెయ్యటం ఎంత సులభం! మన మధ్య అవరోధం ఎంత త్వరలో ఏర్పడిపోతుంది, ఒక్కమాటతో, ఒక్క చేష్టతో, ఒక్క చిరునవ్వుతో! ఆరోగ్యం, మనస్థితి, కోరిక - వీటి వెంట వాటి నీడ పడుతుంది. అంతవరకూ ఉత్సాహంగా ఉన్నదే మందకొడిగా, భారంగా తయారవుతుంది. వాడుకుని వాడుకుని మనల్ని మనమే అలసిపోయేట్లు చేసుకుంటాం. అంతకు ముందు చురుకుగా స్పష్టంగా ఉన్నదే అలసటగా అయోమయంగా అయిపోతుంది. నిరంతరం ఘర్షణ, ఆశ, నిరాశ - వీటితో, ఎంతో అందంగా సరళంగా ఉన్నదే భయంకరంగా, మర్మ గర్భితంగా అయిపోతుంది. సంబంధం క్లిష్టమైనది, కష్టపూరితమైనది. దానిలోంచి ఏ మచ్చా లేకుండా బయటపడగలిగే వాళ్లు చాలా కొద్దిమంది ఉంటారు. మనం