పుట:Mana-Jeevithalu.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

13. సద్గుణం

సముద్రం ప్రశాంతంగా ఉంది. తెల్లని ఇసుక మీద ఒక్క అల అయినా లేదు. ఆ విశాలాఖాతానికి ఉత్తరం వైపు చుట్టూ పట్టణం ఉంది. దక్షిణం వైపు కొబ్బరి చెట్లున్నాయి దాదాపు నీటికి తగుల్తూ. ఇనుప కమ్మీకి అవతల ఉన్న పెద్ద చేపల్లో మొదటిది కొద్దిగా కనిపిస్తోంది. వాటికవతల చేపలవాళ్ల పడవలూ, లావాటి తాళ్లతో కట్టేసిన కొన్ని దుంగలూ ఉనాయి. కొబ్బరి చెట్లకు దక్షిణంగా ఉన్న గ్రామానికి వెడుతున్నారు వాళ్లు. సూర్యాస్తమయం దేదీప్యమానంగా ఉంది - మామూలుగా ఉంటుందనుకునే చోట కాక తూర్పువైపున. అది సూర్యాస్తమయపు ప్రతిబింబం మాత్రమే. అందమైన ఆకృతుల్లో ఉన్న పెద్ద పెద్ద మేఘాలు సూర్యకిరణం ప్రతిఫలించే రంగు లన్నిటితోనూ వెలుగుతున్నాయి. అది నిజంగా అద్భుతంగా, భరించలేమన్నట్లుగా ఉంది. నీటిపైన కూడా ఆ కాంతివంతమైన రంగులు పడి అనంతాకాశానికి కాంతిపథాన్ని సృష్టించాయి.

పట్నం నుంచి పల్లెలకి తిరిగి వెడుతున్న కొంతమంది చేపలవాళ్ళు మినహా, ఆ సముద్రపు ఒడ్డు దాదాపు నిర్మానుష్యంగా, నిశ్శబ్దంగా ఉంది. మేఘాలకు పైన ఒకే ఒక్క నక్షత్రం కనిపిస్తోంది. మేము తిరిగి వస్తూంటే ఒక స్త్రీ మాతో బాటు చేరి గంభీరమైన విషయాలు మాట్లాడటం మొదలు పెట్టింది. ఆవిడ ఒక సంఘంలో చేరిందట. ఆ సంఘ సభ్యులు ధ్యానం చేస్తారుట. ముఖ్యమైన సద్గుణాలన్నిటినీ అలవరచుకుంటారుట. ప్రతినెలా ఒక సద్గుణాన్ని ఎంచుకుని, ఆ నెలంతా దాన్ని సాధన చేసి ఆచరణలో పెట్టటం జరుగుతుందిట. ఆవిడ ధోరణిని బట్టీ, మాట్లాడిన దాన్ని బట్టీ, ఆత్మశిక్షణలో ఆవిడ బాగా తర్ఫీదు పొందిన దానిలాగ, ఆవిడ మనోభావాలకీ, ఉద్దేశాలకీ వ్యతిరేకంగా ఉన్నవారిపట్ల కొంత అసహనం ఉన్నదానిలాగ కనిపించింది.

సద్గుణం హృదయానికి సంబంధించినది; మనస్సుకి చెందినది కాదు. మనస్సు ఒక సద్గుణాన్ని అలవరచుకుంటున్నదంటే బాగా కపటంగా ఆలోచిస్తున్నట్లే. అదొక ఆత్మరక్షణ - పరిసరాల కనుగుణంగా, తెలివిగా సర్దుకుపోవటమే. స్వీయపరిపక్వత కోసం ప్రయత్నించటం అంటే సద్గుణాన్ని