పుట:Mana-Jeevithalu.pdf/331

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
322
మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

ఆలోచిస్తూ ఉండలేం."

కేవలం ఏదో ఒక పని చేస్తూ ఉండటానికి మౌలిక విషయాలు సమస్య కావు. వారికి కావలసినదల్లా పైపైకి లాభదాయకంగా ఉండి, తీవ్రమైన హాని కలిగించే కార్యకలాపం మాత్రమే. కాని మీ స్నేహితుణ్ణి ఒకటి అడగనిస్తారా? ఒక రకమైన పని మీకెందుకంత ముఖ్యం? దానిమీద అంత మమకారం దేనికి?

"ఓ, నాకే తెలియదు. కాని దానివల్ల నాకు ఎంతో ఆనందం కలుగుతుంది."

అందుచేత మీరు నిజంగా ఆసక్తి చూపిస్తున్నది అ పనిలో కాదు, దానివల్ల మీకు లాభించేదానిలోనే. దాని వల్ల మీరు డబ్బు చేసుకోలేక పోవచ్చు. కాని దానివల్ల ఆనందం పొందుతారు. తన పార్టీని గాని దేశాన్నిగాని రక్షించటంలో మరొకరు అధికారాన్నీ పదవినీ, పరపతినీ పొందినట్లే మీ పనిలో మీరు సంతోషాన్ని పొందుతారు. మరొకరు తన రక్షకుడికీ, గురువుకీ తన ప్రభువుకీ సేవచేసి ఎంతో తృప్తిని పొంది దాన్ని వరం అన్నట్లు గానే మీరు చేసే సేవ అనే దాంట్లో తృప్తిని పొందుతున్నారు. మీ సొంత ఆనందమే అన్నిటికన్నా ముఖ్యం. మీరుచేసే ఆ పనివల్ల మీరు కోరిన దాన్ని పొందుతున్నారు. మీకు నిజంగా మీరు సహాయపడే మనుషులమీద ఆసక్తి లేదు. వాళ్లు మీ ఆనందాని కొక సాధనం మాత్రమే. సహజంగా అసమర్ధులైన వాళ్లూ, మీ దారికి అడ్డు నిలిచిన వాళ్లూ గాయపడతారు. ఎందువల్లనంటే, పని ముఖ్యం. ఆ పనిలోనే మీ ఆనందం ఉంది. ఇది నిర్దాక్షిణ్యమైన యథార్థం. కాని, దాన్ని మనం గడుసుగా సేవ, దేశం, శాంతి, దైవం, అలాంటి ఉన్నత పదాలతో కప్పి పుచ్చుతాం.

అందుచేత, చెప్పాలంటే, మీకు నిజంగా అభ్యంతరం లేదు వాళ్లకి హాని కలిగించటం - మీకు ఆనందాన్నిచ్చే పని సమర్దవంతంగా జరగకుండా అడ్డుపడే వారికి. ఒక పనిలో మీకు ఆనందం దొరకుతుంది. ఆ పని ఏదైనా, మీరే అది. ఆనందం పొందటంలోనే మీకు ఆసక్తి, ఆపని మీకు సాధనంగా అవుతుంది. అందువల్ల ఆ పని చాలా ముఖ్యమవుతుంది. అదికాక, మీరు