పుట:Mana-Jeevithalu.pdf/326

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భద్రత

317

మీరు పోగొట్టుకుంటారని భయపడేవి ఇవేమీ కానట్లయితేనూ, బాహ్యంగా భద్రత లేకపోవటం గురించి మీరు భయపడటం లేదన్నట్లయితేనూ, మరి దేన్ని గురించి ఆదుర్దాపడుతున్నారు? వెంటనే సమాధానం చెప్పెయ్యకండి. ఊరికే వినండి. కనుక్కోవటానికి జాగ్రత్తగా గమనించండి. భౌతిక భద్రత లేకపోవటం వల్ల భయపడటం లేదని మీకు నిశ్చయంగా తెలుసునా? అలాంటి విషయమై నిశ్చయంగా తెలుసుకోగలిగినంతవరకూ మీరు భయపడటం లేదని చెబుతున్నారు. ఇది మాటల్లో నొక్కి చెప్పటమే కానట్లయితే, మరి దేన్ని గురించి భయపడుతున్నారు?

"భౌతికంగా భద్రత ఉండదని నేను భయపడటం లేదని నిశ్చయంగా తెలుసును నాకు. మేము వివాహం చేసుకుని ఏది కావాలంటే అది పొందగలం. కేవలం వస్తువులు పోవటం గురించే కాక వేరే దేన్ని గురించో భయపడుతున్నాను. అదేమిటి?"

"తెలుసుకుందాం. కాని మెల్లిగా విచారిద్దాం. మీరు నిజంగా తెలుసు కోవాలనుకుంటున్నారా, లేదా?"

"నిజంగానే. అనుకుంటున్నాను, ముఖ్యంగా ఇంతవరకూ మనం వచ్చినమీదట. నేను భయపడుతున్నది దేని గురించి?

దాన్ని కనుక్కోవాలంటే మనం నిశ్శబ్దంగా జాగ్రత్తగా గమనించాలి తొందర పడకుండా. భౌతికంగా భద్రత లేకపోవటం గురించి మీరు భయపడటం లేదనట్లయితే, అంతరంగిక భద్రత ఉండదని భయపడుతున్నారా? మీరు పెట్టుకున్న లక్ష్యాన్ని సాధించలేమోనని భయపడుతున్నారా? జవాబు చెప్పొద్దు, ఊరికే వినండి. గొప్పవాడిగా అవలేకపోతేనేమోనని భయపడుతున్నారా? మీకేదైనా మత సంబంధమైన ఆదర్శం ఉండి ఉండొచ్చు. దాని ప్రకారం జీవించలేకపోతారేమోననీ, దాన్ని సాధించలేకపోతారేమోననీ అనిపిస్తోందా? ఆ విషయంలో ఒక విధమైన నిరాశ, తప్పుచేస్తున్నాననే భావం, నిస్పృహా కలుగుతున్నాయా?

"మీరు సరిగ్గా చెప్పారు. కొన్ని సంవత్సరాల క్రిందట, నేను కుర్రవాడిగా ఉన్నప్పుడు మీ ప్రసంగం విన్నప్పటినుంచీ, నిజం చెప్పాలంటే, మీలా