పుట:Mana-Jeevithalu.pdf/322

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
313
భద్రత

మబ్బు కమ్మి ఉంది. జల్లుపడటం మొదలుపెట్టింది. మబ్బుల్లోంచి ఉరుములొస్తున్నాయి. మెరుపు ఇంకా దూరంలో ఉంది. కాని మేము తలదాచుకున్న చెట్టు దగ్గరికి సమీపిస్తోంది. దట్టంగా వాన కురవటం మొదలు పెట్టింది. కలువ ఆకులమీద నీటి చుక్కలు పోగవుతున్నాయి. నీటిచుక్కలు మరీ పెద్దవైనప్పుడు ఆకుల మీంచి క్రిందికి జారి పోతున్నాయి, కాని అంతలోనే మళ్లీ నీటి చుక్కలు పోగవుతున్నాయి. మెరుపు ఇప్పుడు చెట్టుమీదికి వచ్చింది. పశువులు భయపడి తాళ్లు వదిలించుకోవటానికి గింజుకుంటున్నాయి. నల్లని దూడ ఒకటి తడిసిపోయి ఒణుకుతూ హృదయ విదారకంగా అరుస్తోంది. దాని తాడు తెంపేసుకుని దగ్గరలో ఉన్న ఒక గుడిసె వైపుకి పరుగెత్తింది. కలువ పువ్వులు గట్టిగా ముడుచుకుంటున్నాయి ముంచుకొస్తున్న చీకట్లు తమ హృదయాల్లోకి చొరబడకుండా. వాటి బంగారు హృదయాలు కనిపించాలంటే కలువరేకుల్ని చింపాల్సి ఉంటుంది. మళ్లీ సూర్యుడు వచ్చేవరకూ అలాగే గట్టిగా ముడుచుకుని ఉంటాయి. వాటి నిద్రలో కూడా అవి అందంగా ఉన్నాయి. మెరుపు ఊరువైపుకి సాగుతోంది. ఇప్పుడు బాగా చీకటి పడింది. కాలవ గొణుగుడు మాత్రమే వినిపిస్తోంది.

అ దారి గుండా ఊరుదాటితే రోడ్డు వస్తుంది. అక్కణ్ణించి మళ్లీ మేము చప్పుళ్లతో నిండిన పట్నానికి తిరిగి వెళ్లాం.

అతడు యువకుడు. ఇరవై ఏళ్లప్రాంతంలో ఉన్నాడు. బాగా పుష్టిగా ఉన్నాడు. కొంత ప్రయాణాలవీ చేసినవాడు. కాలేజిలో చదువుకున్నాడు. మనస్తిమితం లేకుండా ఉన్నాడు. అతని కన్నుల్లో ఆదుర్దా కనబడుతోంది. అప్పటికే ఆలస్యం అయింది. అయినా మాట్లాడాలనుకుంటున్నాడు. ఎవరైనా అతని మనస్సుని పరిశోధించాలని కోరుతున్నాడు. తన గురించి తాను ఎంతో మామూలుగా ఏవిధమైన సంకోచం, నటనా లేకుండా బయట పెట్టుకున్నాడు. అతని సమస్య స్పష్టమైంది, కాని అతనికి కాదు. అతనింకా తడుముకుంటూ వెతుకుతూనే ఉన్నాడు.

ఉన్నదాన్ని మనం వినం, కనుక్కోం. మన ఊహల్ని ఉద్దేశాల్నీ ఇంకోదానిమీద రుద్దుతాం. ఇంకోదాన్ని మన ఆలోచనా విధానంలోకి ఇరికించటానికి ప్రయత్నిస్తాం. ఉన్నస్థితికంటె మన ఆలోచనలూ, నిర్ణయాలూ మనకి