పుట:Mana-Jeevithalu.pdf/318

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
309
అసత్యాన్ని అసత్యమని గ్రహించటం

తున్నాయి. గదిలో దీపం వెలిగించి ఉంది కాని, అంత ప్రకాశవంతంగా లేదు. ఇంటిల్లిపాదీ అక్కడికి చేరారు. అందరూ తమ ప్రార్థనల్లో ఆనందంగా ఉన్నట్లున్నారు. రోడ్డు మధ్యగా ఒక కుక్క గాఢంగా నిద్రపోతోంది. సైకిలు మీద పోతున్న ఒకతను దాన్ని చుట్టివెళ్లాడు. ఇప్పుడు చీకటి పడుతోంది. నిశ్శబ్దంగా నడిచివెళ్లేవాళ్ల ముఖాలమీద మిణుగురు పురుగుల వెలుగుపడుతోంది. ఒకటి ఒకావిడ తల్లో చిక్కుకుని, ఆవిడ తల సన్నగా వెలుగుతోంది.

మనం సహజంగా ఎంత దయగా ఉంటాం, ముఖ్యంగా పట్టణాలకి దూరంగా పొలాల్లోనూ, చిన్న ఊళ్లలోనూ! తక్కువ చదువుకున్న వాళ్ల మధ్య జీవితం ఆత్మీయంగా ఉంటుంది. వృద్ధిలోకి రావాలనే 'వాంఛాజ్వరం' ఇంకా వ్యాపించలేదు. పిల్లవాడు మీకేసి చూసి చిరునవ్వు నవ్వుతాడు. ముసలావిడ తెల్లబోతుంది. మనిషి సందేహిస్తూ పక్కనుంచి వెడతాడు. గుంపుగా ఉన్నవాళ్లు గట్టిగా మాట్లాడుకోవటం ఆపేసి ఆశ్చర్యంతో కూడిన ఆసక్తితో చూడటానికిటు తిరుగుతారు. ఆడమనిషి మీరు దాటి వెళ్లేవరకూ ఆగుతుంది. మనలో ఒకరి గురించి ఒకరికి ఎంత స్వల్పంగా తెలిసి ఉంటుందో మనకి తెలుసు, కాని, మనం అర్థం చేసుకోము. మనకి తెలుసు, కాని ఇంకొకరితో సంపర్కం ఉండదు. మన గురించి మనకే తెలియదు. ఇంక ఇంకొకరు ఎలా తెలుస్తారు? ఇంకొకర్ని ఎన్నటికీ తెలుసుకోలేము. ఇంకొకరితో సంపర్కం మాత్రం పెట్టుకోగలం. చనిపోయిన వారిని గురించి తెలుసుకోగలం. కాని జీవించి ఉన్నవారి గురించి ఎన్నటికీ తెలుసుకోలేం. మనకి తెలిసినది మరణించిన గతం, జీవించి ఉన్నదికాదు. చనిపోయిన వాటిని మనలోనే పాతిపెట్టుకోవాలి. మనకి చెట్లపేర్లూ, పక్షులపేర్లూ, దుకాణాలపేర్లూ తెలుసును. కాని, మన గురించి మనకి ఏమీ తెలియదు - ఏవో కొన్ని మాటలూ, కోరికలూ మినహాయించి. మనదగ్గర వివరాలూ, నిర్ణయాలూ ఉంటాయి. ఎన్నిటి గురించో; కాని ఆనందం ఉండదు. నిర్జీవం కానట్టి శాంతి ఉండదు. మన జీవితాలు మందకొడిగా శూన్యంగా ఉంటాయి, లేదా మనల్ని గుడ్డివాళ్లను చేసేటన్ని మాటలతో, కార్యకలాపాలతో నిండి ఉంటాయి. జ్ఞానం వివేకం కాదు. వివేకం లేనిదే శాంతి ఉండదు, ఆనందం ఉండదు.

ఆయన చిన్న వయస్సులోనే ఉన్నాడు. ఏదో ఫ్రొపెసరు. అసంతృప్తిగా