పుట:Mana-Jeevithalu.pdf/317

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

308

మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

తెలిసినది కాదు. తెలిసినది అనుభూతి. ఏం చేసినా సరే, ఆలోచన ఆనందం కాలేదు. ఆనందాన్ని వెతికిపట్టుకోలేదు. ఆలోచనకి తన నిర్మాణం గురించీ, తన కదలిక గురించీ మాత్రమే తెలుసును. ఆలోచన తన్నుతాను అంతం చేసుకోవటానికి ప్రయత్నం చేసిందంతే, తాను మరింత విజయవంతం అవటానికీ, లక్ష్యాన్ని చేరుకోవటానికీ, మరింత సంతృప్తినిచ్చే గమ్యాన్ని చేరుకోవటానికీ మాత్రమే. ఇంకా ఎక్కువ అనేది జ్ఞానం. ఆనందంకాదు. ఆలోచన తన పద్ధతులన్నీ తెలుసుకోవాలి, దాని కపటవంచనలన్నిటినీ తెలుసుకోవాలి. తన్ను గురించి తాను ఏవిధమైన కోరికా - ఉండాలనిగాని, ఉండకూడదనిగానీ లేకుండా తెలుసుకోవటంలో మనస్సు పని చెయ్యని స్థితికి వస్తుంది. పనిచెయ్యకుండా ఉండటం మరణం కాదు. ఆలోచన పూర్తిగా పనిచెయ్యకుండా ఉండటం మరణం కాదు. ఆలోచన పూర్తిగా పనిచెయ్యకుండా అనాసక్తంగా, అప్రమత్తతతో ఉండటం. అది ఉత్తమస్థితిలో ఉండే సున్నితత్వం. మనస్సు అన్నిస్థాయిల్లోనూ ఏమీ పనిచెయ్యకుండా ఉన్నప్పుడే ఏదైనా క్రియ జరుగుతుంది. మనస్సు యొక్క కార్యకలాపాలన్నీ అనుభూతులూ, ప్రేరేపణకీ, ప్రభావానికీ ప్రతిక్రియలూ మాత్రమే, అంచేత క్రియకానే కాదు. మనస్సు ఏవిధమైన కార్యకలాపం లేకుండా ఉన్నప్పుడే క్రియ జరుగుతుంది. ఈ క్రియకి కారణం ఉండదు. అప్పుడే ఆనందం ఉంటుంది.

86. అసత్యాన్ని అసత్యమని గ్రహించటం

ఆ సాయంకాలం రమణీయంగా ఉంది. వరిచేల వెనక జ్వాలారుణ ఆకాశం. పొడుగ్గా సన్నగా ఉన్న కొబ్బరి చెట్లు గాలికి ఊగుతున్నాయి. బస్సు నిండా జనంతో కొండ ఎక్కుతూ ఎంతో చప్పుడు చేస్తోంది. ఆ కొండ చుట్టూ ఉంది నది, సముద్రానికి చేరే దారిలో, పశువులు బలిసి ఉన్నాయి. మొక్కలు దట్టంగా ఉన్నాయి. పువ్వులు లెక్కలేనన్ని ఉన్నాయి. బొద్దుగా ఉన్న చిన్న కుర్రాళ్లు పొలంలో ఆడుకుంటున్నారు. చిన్నపిల్లలు ఆశ్చర్యపోతూ చూస్తున్నారు. దగ్గరలోనే ఒక చిన్నగుడి ఉంది. విగ్రహం ముందు ఎవరో దీపం వెలిగిస్తున్నారు. విడిగా ఉన్న ఒక ఇంట్లో సాయంకాలపు ప్రార్ధనలు జరుగు