పుట:Mana-Jeevithalu.pdf/310

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దుఃఖం

301

బ్రతకలేనని. మీరనేదేమిటో నాకర్థం అయిందో లేదో నాకు నిశ్చయంగా తెలియదు. ఏదీ గ్రహించలేనంతగా చెదిరిపోయి ఉన్నాను."

చెబుతున్నదానిమీదా, మీరు చుదువుతున్న దానిమీదా పూర్తిగా శ్రద్ధ చూపించకపోయినప్పటికీ మీకు తెలియకుండానే మీకు ఇష్టం ఉన్నాలేకున్నా ఏదో కొంత మీకు వినిపించి మీలో ప్రవేశించటం మీరు తరుచు గమనించ లేదా? ఆ చెట్లకేసి మీరు ప్రయత్నపూర్వకంగా చూడకపోయినా తరవాత వాటి రూపం హఠాత్తుగా ప్రతి వివరంతోనూ కనిపిస్తుంది. అలా జరగటం ఎప్పుడూ కనిపెట్టలేదా? నిజమే, ఈమధ్య కలిగిన అఘాతం వల్ల, మీరు చెదిరిపోయి ఉన్నారు. అయినప్పటికీ, దాన్నుంచి మీరు తేరుకున్న తరవాత, మనం ఇప్పుడు చెబుతున్నది గుర్తుకి వస్తుంది. అప్పుడేమైనా అది సహాయకరంగా ఉండొచ్చు. కాని ముఖ్యంగా మీరు గ్రహించవలసినది - మీరు అఘాతం నుంచి బయటపడ్డాక మీ దుఃఖం మరింత తీవ్రమవుతుంది. అప్పుడు మీ దుఃఖం నుంచి మీరు తప్పించుకుపోవాలని కోరుకుంటారు. మీరు తప్పించుకునేందుకు సహాయపడటానికి చాలామందే ఉంటారు. వాళ్లు వీలైనన్ని కారణాలూ, నిర్ణయాలూ తమకు గాని, ఇతరులకు గాని తట్టినవి అందిస్తారు. అన్ని రకాల సహేతుకమైన సమర్థనలూ చేస్తారు. లేదా, మీ అంతట మీరే మీ దుఃఖాన్ని అణచివేసుకునేందుకు సంతోషకరమైనదో, అసంతోషకరమైనదో, ఏదో మార్గంలో వెనక్కి తప్పుకోవాలని చూస్తారు. ఇప్పటి వరకూ ఆ సంఘటనకి మరీ సన్నిహితంగా ఉన్నారు. కాని రోజులు గడుస్తున్న కొద్దీ ఏదో రకమైన ఉపశమనం కోసం తపిస్తారు; మతం, విశ్వాసరాహిత్యం, సాంఘిక కార్యకలాపం, లేదా, ఏదో సిద్ధాంతం. కాని తప్పించుకునే మార్గం ఏ రకమైనదైనా, అది దేవుడైనా, తాగుడైనా, దుఃఖం అంటే అర్థం అవకుండా ఆటంకం కలిగిస్తాయి.

దుఃఖాన్ని అర్థం చేసుకోవాలి గాని నిర్లక్ష్యం చేయకూడదు. నిర్లక్ష్యం చేస్తే దుఃఖం కొనసాగేటట్లు చేయటమే. దుఃఖాన్ని నిర్లక్ష్యం చేయటమంటే దాన్నుంచి పారిపోవటమే. దుఃఖాన్ని అర్థం చేసుకోవటానికి ఆచరణాత్మకమైన, ప్రయోగాత్మకమైన పద్ధతి అవసరం. ప్రయోగం చేయటమంటే ఒక నిశ్చిత ఫలితం కోసం ప్రయత్నించటం కాదు. నిశ్చిత ఫలితం కోసం ప్రయత్నిస్తే