పుట:Mana-Jeevithalu.pdf/309

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

300

మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

పోయాను. నన్ను నేను మరిచిపోయాను. నాకు ప్రేమ తెలుసును. ఆమె పట్ల నాకింకా అదే ప్రేమ. కాని, ఇప్పుడు తక్కినవి కూడా తెలుసుకుంటున్నాను. నా గురించీ, నా దుఃఖం గురించీ, నా దుర్దినాల గురించీ."

ఎంత త్వరలో ప్రేమ ద్వేషంగా, అసూయగా, దుఃఖంగా మారి పోతుంది! ఆ పొగలో ఎంత లోతుగా కొట్టుకుపోతాం! అంత దగ్గరగా ఉండేది ఎంత దూరమై పోతుంది! ఇప్పుడు మన ఇతర విషయాలన్నీ కూడా తెలుసుకున్నాం. హఠాత్తుగా తెలుసుకున్నాం. హఠాత్తుగా అవి ఎంతో ఎక్కువ ముఖ్యమైపోయాయి. ఇప్పుడు మనం ఒంటరిగా ఉన్నామనీ, తోడు లేకుండా ఉన్నామనీ, చిరునవ్వూ, చనువుగా తిట్టటం లేవనీ తెలుసుకున్నాం, ఇంకొకరి గురించే కాకుండా మన గురించి కూడా మనం తెలుసుకున్నాం. ఇది వరకు ఇంకొకరే సర్వమూ, మనం ఏమీకాదు. ఇప్పుడు ఇంకొకరు లేరు. మనం ఉన్నది ఉన్నట్లుగా ఉన్నాం. ఇంకొకరు కల, వాస్తవమైనది మనం ఉన్న స్థితే. ఇంకొకరు ఎప్పుడైనా వాస్తవంగా ఉన్నారా? లేక మనం సృష్టించుకున్న కలేనా? త్వరలో మాయమైపోయే మన ఆనందం అనే అందమైన వస్త్రం కప్పిన కలేనా అది? మాయమైపోవటమే మరణం. మనం ఉన్నదే జీవితం. మరణంలో ఎప్పుడూ జీవితం ఇమిడి ఉండదు - మనం ఎంత కోరుకున్నా. జీవితమే మరణం కన్న శక్తిమంతమైనది. లేనిదానికన్న ఉన్నదానికే శక్తి ఎక్కువ. కాని మనం మరణాన్నే ఎంతగా ప్రేమిస్తాం, జీవితం కన్న! జీవితాన్ని కాదనటం ఎంతో సంతోషదాయకంగా, విస్మరణీయంగా ఉంటుంది. ఇంకొకటి ఉంటే మనం ఉండం. ఇంకొటి ఉన్నప్పుడు మనం స్వేచ్ఛగా మొహమాటం లేకుండా ఉంటాం. అ ఇంకొకటి పువ్వు, పక్కింటివాళ్లు, సువాసన, జ్ఞాపకం. మనందరికీ ఇంకొకటే కావాలి. ఇంకొకదానితోనే మనల్ని మనం ఐక్యం చేసుకుంటాం. ఇంకొకటే ముఖ్యం, మనం కాదు. ఇంకొక్కటే మన స్వప్నం; లేచిన తరవాత మనం ఉన్నస్థితిలో మనం ఉంటాం. ఉన్నస్థితి మరణం లేనిది. కాని ఉన్నస్థితిని మనం అంతం చెయ్యాలనుకుంటాం. అంతం చెయ్యలనే కోరికలో నుంచి కొనసాగేది పుడుతుంది. కొనసాగేదానికెప్పుడూ మరణరహితమైన దేమిటో తెలియదు.

"నాకు తెలుసును నేనీవిధంగా జీవస్మరణం లాంటి బ్రతుకు ఇంక