పుట:Mana-Jeevithalu.pdf/308

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దుఃఖం

299

ఆరుమాసాల్లోనూ నేను చచ్చిపోయానా అనిపిస్తోంది. మాకు పిల్లల్లేరు. కాని, అప్పుడు గర్భిణిగా ఉంది. వెళ్ళిపోయింది. ఇప్పటికి కూడా నమ్మలేక పోతున్నాను. ఎందుకంటే ప్రతీదీ మేమిద్దరం కలిసిచేసేవాళ్లం. తను ఎంత అందమైనదో, ఎంత మంచిదో - నేనేం చెయ్యాలిప్పుడు? అలా ఆపులేకుండా ఏడ్చినందుకు చింతిస్తున్నాను. అలా ఎందుకు జరిగిందో భగవంతుడికే తెలియాలి. అలా ఏడవటం మంచిదే అయిందని తెలుసు. కానిం మళ్లీ ఇదివరకులా ఎప్పటికీ ఉండదు. నా జీవితంలోంచి ఏదో వెళ్ళిపోయింది. మొన్నోరోజు కుంచెలు తీసుకున్నాను. కాని, అవి అపరిచితంగా తోచాయి. ఇదివరకు చేతిలో కుంచె ఉన్న సంగతి కూడా తెలిసేది కాదు. ఇప్పుడు అది బరువుగా, భారంగా ఉంటోంది. తరుచు నదివైపుకి వెళ్ళాను తిరిగి రాకూడదనుకుంటూ. కాని, ప్రతిసారీ తిరిగి వచ్చాను. జనాన్ని చూడలేక పోతున్నాను. ఆమె ముఖమే కనిపిస్తోంది. ఆమెతోనే నిద్రపోతున్నాను. కలగంటున్నాను, కలిసి తింటున్నాను. కాని, మళ్లీ ఇదివరకులా ఎన్నటికీ ఉండదని నాకు తెలుసు. దాని గురించి తర్కించుకున్నాను, ఆ సంఘటనని సహేతుకంగా చూసి అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాను, కాని, నాకు తెలుసు ఆమె ఇంకలేదని; ప్రతి రాత్రీ ఆమె గురించే కలగంటున్నాను; కాని, ఎంతకీ నిద్రపోలేను ప్రయత్నించినా. ఆమె వస్తువులు ముట్టుకోవటానికి భయం. వాటి వాసన కొంచెం తగిలినా పిచ్చెత్తిపోతోంది. మరిచిపోవటానికి ప్రయత్నించాను. కాని, ఏంచేసినా మళ్లీ ఇదివరకులా ఉండదెన్నటికీ. ఇదివరకు పక్షులగానాన్ని వినేవాణ్ణి. ఇప్పుడు ప్రతివస్తువుని నాశనం చెయ్యాలనిపిస్తోంది. ఇంకా ఇలా ఉండటం నావల్ల కావటం లేదు. అప్పటి నుంచీ నా స్నేహితుల్ని ఎవర్నీ కలుసుకోలేదు. ఆమె లేకుండా వాళ్లు నాకు ఏమీ కారనిపిస్తోంది. నేనేం చెయ్యను?"

మేము చాలాసేపు మౌనంగా ఉన్నాం.

దుఃఖానికీ ద్వేషానికీ దారితీసే ప్రేమ ప్రేమ కాదు. మనకి ప్రేమంటే తెలుసునా? అడ్డం వస్తే ఆగ్రహంగా మారేది ప్రేమేనా? లాభం, నష్టం ఉన్నప్పుడు ప్రేమ ఉంటుందా?

"ఆమెని ప్రేమించటంలో అవేమీ లేవు. వాటన్నిటినీ పూర్తిగా మరిచి