పుట:Mana-Jeevithalu.pdf/306

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దుఃఖం

297


"కాని జీవితంలో దానివల్ల ప్రయోజనం ఏమిటి?"

జీవితం ఆలోచనే అయితే, ఏమీ లేదు. దానిద్వారా మనం శాంతీ, ఆనందం పొందాలనీ, అన్ని కష్టాలనూ అడ్డుకునే రక్షకసాధనంగా ఉండాలనీ, మనుష్యులలో ఐకమత్యాన్ని నెలకొల్పే సాధనంగా ఉండాలనీ కోరుకుంటాం. దాన్ని ఏవిధమైన ప్రయోజనానికీ ఉపయోగించుకోవటం కుదరదు. ప్రయోజనం అనగానే లక్ష్యసాధన అని అర్థం వస్తుంది. అప్పుడు మళ్లీ వెనక్కి వస్తాం - ఆలోచనా ప్రక్రియతో సహా, మనస్సు కాలరహితమైన దాన్ని రూపొందించలేదు, తన లక్ష్యం కోసం దాన్ని మలుచుకోలేదు. దాన్ని ఉపయోగించుకోలేదు. కాలరహితమైనది ఉన్నప్పుడే జీవితానికి అర్థం ఉంటుంది. లేకపోతే, జీవితం అంటే దుఃఖం, సంఘర్షణా, బాధా. ఆలోచన ఏ మానవసమస్యనీ పరిష్కరించలేదు - ఎందుకంటే ఆలోచనే సమస్య కనుక. జ్ఞానం అంతం కావటమే వివేకానికి ఆరంభం. వివేకం కాలానికి చెందినది కాదు. అనుభవం, జ్ఞానం కొనసాగటం కాదు వివేకం. కాలమయ జీవితం అంటే గందరగోళం, దుఃఖం. కాని, ఉన్నస్థితి కాలరహితంగా ఉన్నప్పుడు ఆనందం ఉంటుంది.

84. దుఃఖం

చచ్చిపోయిన ఒక పెద్ద జంతువు నదిలో కొట్టుకుపోతుంది. దానిమీద కొన్ని రాబందులు కూర్చుని దాని చర్మాన్ని ఒలిచేస్తున్నాయి; తక్కిన రాబందుల్ని చెదరగొడుతున్నాయి - తమ కడుపులు నిండేదాకా. నిండిన తరవాత ఎగిరి పోతాయి. తక్కినవి కొన్ని చెట్లమీదా, ఒడ్డుమీదా ఉన్నాయి. కొన్ని నెత్తిమీద తిరుగాడుతున్నాయి. సూర్యుడు అప్పుడే ఉదయించాడు. గడ్డి మీద మంచు బిందువులున్నాయి. నదికి అవతల ఒడ్డున ఉన్న పచ్చని పొలాలు మసగ్గా కనిపిస్తున్నాయి. రైతుల గొంతులు నీటికవతల నుంచి స్పష్టంగా వినవస్తున్నాయి. అది రమణీయమైన ఉదయం, స్వచ్ఛంగా, కొత్తగా ఉంది. ఒక కోతిపిల్ల తల్లి చుట్టూ ఆడుకుంటోంది చెట్ల కొమ్మల్లో. కొమ్మ పొడుగుతా పరుగెత్తి పక్క కొమ్మమీదికి గెంతుతోంది. మళ్లీ పరుగెత్తుకుంటూ