పుట:Mana-Jeevithalu.pdf/295

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

286

మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

ఆలోచన ఎలా అవగాహన చేసుకోగలదు ఎప్పటికైనా? అర్థం చేసుకోవటం కావాలని జరిపే ప్రక్రియా? అర్థం చేసుకోవటానికి ప్రత్యేకం పూనుకుంటారా? ఒక సాయంకాలపు అందాన్ని ఆనందించాలని ఎంచుకుంటారా?

"అర్థం చేసుకోవటం చైతన్యంతో చేసే కృషి కాదా?"

చైతన్యం అంటే మన ఉద్దేశం ఏమిటి? మనం చైతన్యంగా ఎప్పుడుంటున్నాం? ఏదైనా ఎదురైనప్పుడు, ప్రేరణ కలిగినప్పుడు. సుఖప్రదమైనది గాని, బాధాకరమైనదిగాని, దానికి జరిగే ప్రతిక్రియేకాదా చైతన్యం అంటే? ఎదురైన దానికి జరిగే ప్రతిక్రియ అనుభవం. అనుభవం అంటే పేరుపెట్టటం, మాటల్లో పెట్టటం, దేనితోనో సంబంధం కలిగి ఉండటం. పేరుపెట్టకుండా ఏ అనుభవమూ ఉండదు, ఉంటుందా? ఎదురువటం, ప్రతిక్రియ, పేరు పెట్టటం, అనుభవం - ఈ మొత్తం ప్రక్రియ అంతా కలిస్తే చైతన్యం, కాదా? చైతన్యం ఎప్పుడూ గతానికి చెందిన ప్రక్రియే. తెలిసిన కృషి, అవగాహన చేసుకోవాలనే ఇచ్ఛ. పోగు చెయ్యాలనీ, ఉండాలనే ఇచ్ఛ కొనసాగుతున్న గతమే. కొంతమార్పుతో కావచ్చు, కాని అప్పటికీ గతమే. ఏదో ఉండాలనీ, ఏదో అవాలనీ మనం ప్రయత్నించటంలో, ఆ ఏదో అనేది మన కల్పనే. మనం అర్థం చేసుకోవటానికి తెలిసి కృషిచేస్తే మనం సేకరించిన వాటి చప్పుడే మనం వింటాం. ఈ చప్పుడే అవగాహనకి ఆటంకం.

"అయితే వివేకం అంటే ఏమిటి?"

జ్ఞానం అంతమైనప్పుడే వివేకం ఉంటుంది. జ్ఞానం కొనసాగుతుంది. కొనసాగింపు లేకపోతే జ్ఞానం ఉండదు. కొనసాగేది ఎప్పటికీ స్వేచ్ఛగా కొత్తగా ఉండలేదు. అంతం ఉన్నదానికే స్వేచ్ఛ ఉంటుంది. జ్ఞానం ఎప్పటికీ కొత్తది కాదు. అది ఎప్పుడూ పాతదవటమే. పాతది కొత్తదాన్ని ఇముడ్చుకుంటూ ఉంటుందెప్పుడూ. అ విధంగా శక్తిని పొందుతూ ఉంటుంది. పాతది అంతం అవాలి కొత్తది ఉండాలంటే.

"అంటే మీరనేది, ఇంకోరకంగా చెప్పాలంటే, ఆలోచన అంతమవాలి వివేకం ఉండాలంటే, కాని, ఆలోచన అంతమవటం ఎలా?"

ఏ రకమైన శిక్షణ ద్వారా గాని, సాధన ద్వారా గాని, బలవంతంతో గాని