పుట:Mana-Jeevithalu.pdf/294

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
285
వివేకం పోగుచేసుకునే జ్ఞానంకాదు

మనస్సు సద్గుణాన్ని ప్రదర్శించగలదా ఎన్నటికైనా? ఏదో ఒకటి అవకుండా స్వేచ్ఛగా ఉండటమే సద్గుణం కాదా? వ్యక్తిగుణం కూడా బంధమే కావచ్చు. కాని సద్గుణం ఎన్నటికీ బంధనం కాలేదు. కాని ఏవిధమైన సేకరణ అయినా బంధనే.

"అనుభవం లేనిదే వివేకం ఎలా ఉంటుంది?"

వివేకం ఒకటి, జ్ఞానం వేరొకటి. కూడబెట్టిన అనుభవమే జ్ఞానం. అది కొనసాగే అనుభవం. అదే జ్ఞాపకం. జ్ఞాపకాన్ని పోషించుకోవచ్చు. పటిష్ఠం చేసుకోవచ్చు. మలుచుకోచ్చు, ప్రభావితం చేసుకోవచ్చు; కాని వివేకమంటే జ్ఞాపకం విస్తృత మవటమేనా? కొనసాగింపు ఉండేది వివేకమా? మనవద్ద జ్ఞానం ఉంది, యుగాలనుంచీ కూడబెట్టినది. కాని మనం వివేకవంతులుగా ఆనందంగా సృజనాత్మకంగా ఎందుకులేం? జ్ఞానం ఆనందానికి కారణ మవుతుందా? తెలుసుకోవటం అంటే అనుభవాన్ని సేకరించటం, అనుభవించటం కాదు. తెలుసుకోవటం అనుభవించటానికి ఆటంకాన్ని కలిగిస్తుంది. అనుభవాన్ని సేకరించటం కొనసాగుతూ ఉండే ప్రక్రియ. ప్రతి అనుభవం దీన్ని శక్తిమంతం చేస్తుంది. దానికి ప్రాణాన్ని పోస్తుంది. ఈవిధమైన నిత్య ప్రతిక్రియ జరగకపోతే జ్ఞాపకం రూపుమాసిపోతుంది. ఆలోచనే జ్ఞాపకం, మాట, సేకరించిన అనుభవం. జ్ఞాపకం గతం, చైతన్యం లాగే. ఈ గత భారమంతా కూడితేనే మనస్సు, ఆలోచన. సేకరించబడినది ఆలోచన. ఆలోచన ఎన్నటికైనా కొత్తదాన్ని కనిపెట్టగలదా? అది అంత మొందాలి కొత్తది ఉండాలంటే.

"ఇంతవరకూ అర్థం చేసుకోగలను. కాని ఆలోచన లేకుండా అవగాహన ఎలా కాగలదు?"

అవగాహన గతానికి చెందిన ప్రక్రియా? లేక అది ఎప్పుడూ ప్రస్తుతంలోనే ఉండేదా? అర్థం చేసుకోవటం అంటే ప్రస్తుతం జరిగే కార్యం. అవగాహన ఒక క్షణంలో జరిగేదనీ, దానికి సమయంతో నిమిత్తం లేదనీ మీరెప్పుడూ గమనించలేదా? మీరు క్రమంగా అర్థంచేసుకుంటారా? అర్థం చేసుకోవటం ఎప్పుడూ తక్షణమే, ఇప్పుడే కాదా? ఆలోచన గతంలోంచి వచ్చిన ఫలితం. అది గతం మీద ఆధారపడినది. అది గతం యొక్క ప్రతిక్రియ. గతం కూడబెట్టినది. ఆలోచన సేకరింపబడిన దానికి ప్రతిక్రియ. అలాంటప్పుడు,