పుట:Mana-Jeevithalu.pdf/290

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
281
సంతృప్తి

మీ లక్ష్యం సహాయం చెయ్యటం, ఆ చెయ్యటంలో సంపూర్ణ తృప్తిపొందటం. మీరు నిజంగా కోరేది సహాయం చెయ్యాలని కాదు, సహాయ పడటంలో సంతృప్తి కోసం. సహాయపడటంలో సంతృప్తికోసం వెతుకుతున్నారు. ఇంకొకరు ఏదో సిద్ధాంతంలోనో మరొక అలవాటులోనో వెతుకుతారు. సంపూర్ణంగా సంతృప్తిని కలిగించే మందుకోసం వెతుకుతున్నారు. ప్రస్తుతానికి ఆ మందుని సహాయపడటం అంటున్నారు. సహాయపడటానికి కావలసినవన్నీ సమకూర్చుకోవటానికి ప్రయత్నించటంలో సంపూర్ణంగా తృప్తి పొందటానికి కావలసినవి మీకు మీరు సమకూర్చుకుంటున్నారు. మీకు నిజంగా కావలసినది శాశ్వత ఆత్మ సంతృప్తి.

మనలో చాలామందిలో అసంతృప్తి ఉంటే సులభంగా తృప్తి లభిస్తుంది. అసంతృప్తిని త్వరలోనే నిద్రపుచ్చుతారు. దానికి మందువేసి ప్రశాంతంగా మర్యాదగా ఉండేటట్లు చేస్తారు. బాహ్యంగా మీరు అన్ని సిద్ధాంతాలనూ కొట్టివేసి ఉండవచ్చు. కాని, మానసికంగా లోలోపల శాశ్వతంగా పట్టుకుని ఉండేలా ఏదైనా ఉందేమోనని వెతుకుతున్నారు. ఇతరులతో అన్ని వ్యక్తిగత సంబంధాలూ తెంచేసుకున్నానని చెబుతున్నారు. వ్యక్తిగత బాంధవ్యంలో మీకు శాశ్వతమైన సంతృప్తి లభించకపోయి ఉండొచ్చు, అందువల్లనే మీరు ఒక భావనలో సంబంధాన్ని వెతుకుతున్నారు. భావన ఎప్పుడూ స్వయంకల్పితమైనదే. పూర్తిగా తృప్తి కలిగించే అనుబంధం కోసం, అన్ని తుఫానులనూ తట్టుకునే సురక్షితమైన ఆశ్రయం కోసం వెతకటంలో తృప్తినిచ్చే అసలైన దానినే మీరు పోగొట్టుకోరా? తృప్తిపడటం అనేది అసహ్యకరమైన మాట కావచ్చు. కాని నిజంగా తృప్తిపడటం అంటే ఎదుగూ బొదుగూ లేకుండా స్థిరపడిపోవటం, సమాధానపడటం, అనునయింపబడటం, సున్నితత్వం లేకుండా ఉండటం అని అర్థం రాదు. తృప్తిపడటం అంటే ఉన్నస్థితిని అర్థ చేసుకోవటం. ఉన్నస్థితి ఎప్పుడూ స్థిరమైనది కాదు. ఉన్నస్థితికి అర్ధాలు వివరించే మనస్సు, అనువాదం చేసే మనస్సు సంతృప్తి గురించి తనకున్న దురభిప్రాయంలో తానే చిక్కుకుంటుంది. అర్థాలు వివరించటం అవగాహన చేసుకోవటం కాదు.

ఉన్నస్థితిని అవగాహన చేసుకోవటంతో అనంతమైన ప్రేమా, మార్దవం,