పుట:Mana-Jeevithalu.pdf/289

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
280
మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

మీకు సంతృప్తి కావాలి. అంటే మీకు అసంతృప్తి లేదు. మీకు నిజంగా అసంతృప్తి ఉంటే దాన్నుంచి పారిపోయే మార్గం కోసం ప్రయత్నించరు. సంతృప్తి పడాలని ప్రయత్నిస్తే ఏదో విధమైన బాంధవ్యంలో - సొంతమైన వాటితోగాని, ఒక మనిషితోగాని, ఒక సిద్ధాంతంతోగాని ఏర్పడిన బాంధవ్యంలో అసంతృప్తి దొరకుతుంది మీకు.

"అవన్నీ చూడటం అయింది. అయినా నాకు అసంతృప్తి ఉంది."

"మీకు బాహ్య సంబంధాలతో అసంతృప్తి కలిగి ఉండవచ్చు. కాని సంపూర్ణ సంతృప్తిని కలిగించే మానసిక బంధం కోసం మీరు అన్వేషిస్తూ ఉండవచ్చు."

"అదీ అనుభవం అయింది. అయినా ఇంకా అసంతృప్తిగానే ఉంది."

నిజంగా అలా ఉన్నారా అని నా అనుమానం? మీరు పూర్తిగా అసంతృప్తిగా ఉంటే ఏ దిశలోనైనా కదలటం అంటూ ఉండదు, ఉంటుందా? మీకు గదిలో ఉండటమే పూర్తిగా అసంతృప్తికరంగా ఉంటే మరో పెద్ద గదికోసం, మంచి సామానుతో ఉన్న గదికోసం వెతకరు. కాని ఇంతకంటె మంచి గది కావాలనే కోరికనే మీరు అసంతృప్తి అంటున్నారు. మీరు అన్ని గదులతోనూ అసంతృప్తి పొందలేదు - ఈ ప్రత్యేకమైన గదిలో మాత్రమే. దాన్నుంచి మీరు తప్పించుకోవాలనుకుంటున్నారు. మీరు నిజంగా తృప్తికోసమే వెతుకుతున్నారు. అందుకనే మీరు నిత్యం నిర్ణయిస్తూ, పోలుస్తూ, బేరీజు వేసుకుంటూ, కాదంటూ తిరుగుతున్నారు. అందువల్ల సహజంగా అసంతృప్తి పడుతున్నారు. అంతేకాదా?

"అలాగే కనిపిస్తోంది, కాదా?

అందువల్ల మీరు నిజంగా అసంతృప్తి పడటం లేదు. ఇంతవరకు ఎందులోనూ మీకు సంపూర్ణమైన, శాశ్వతమైన సంతృప్తి దొరకటం లేదు, అంతే. మీకు కావలసినదదే. సంపూర్ణ సంతృప్తి, ఏదో ప్రగాఢమైన అంతర్గత తృప్తి, శాశ్వతంగా ఉండేది.

"కాని, నాకు సహాయం చెయ్యాలని ఉంది. అయితే, ఈ అసంతృప్తి నన్ను నేను సంపూర్ణంగా అర్పించుకోకుండా అడ్డుపడుతోంది."