పుట:Mana-Jeevithalu.pdf/274

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జ్ఞానులా, వివేకవంతులా?

265

సిద్ధాంతం ప్రకారం అనుభవం పొందటం ఆ నమ్మకం, అభిప్రాయం మరింత కొనసాగేటట్లు జరగటం మాత్రమే. అటువంటి అనుభవం నమ్మకాన్ని పటిష్ఠం చేస్తుంది. అభిప్రాయం వేరుచేస్తుంది. ఒక అభిప్రాయం ప్రకారం, ఒక పథకం ప్రకారం మీరు పొందిన అనుభవం మిమ్మల్ని మరింత వేరుచేస్తుంది. జ్ఞానం, మానసికంగా కూడబెట్టినదయిన అనుభవం ప్రభావితం చేస్తుందంతే. అనుభవం పొందటం మరోరకంగా తన్ను తాను గొప్పగా చేసుకోవటమే. అనుభవం వల్ల కలిగిన జ్ఞానం మానసిక స్థాయిలో అవగాహనకి అంతరాయం కలిగిస్తుంది.

"మన నమ్మకం ప్రకారమే మనం అనుభవం పొందుతామా?"

అది స్పష్టమే, కాదా? ఒక రకమైన సమాజం వల్ల మీరు ప్రభావితం అయారు - అంటే మరొక స్థాయిలో - దేవుడిలో నమ్మకం, సాంఘిక విభేదాల్లో నమ్మకం; మరొకరు దేవుడు లేడనీ, ఒక ప్రత్యేక సిద్ధాంతాన్నీ అనుసరించాలనీ ప్రభావితం అవుతాడు. మీరిద్దరూ మీమీ నమ్మకాల ప్రకారమే అనుభవం పొందుతారు. కాని, అటువంటి అనుభవం తెలియని దాన్ని తెలుసుకోనివ్వకుండా ప్రతిబంధకమవుతుంది. అనుభవం, జ్ఞానం రూపంలో కొన్ని స్థాయిల్లో ఉపయోగకరమే. కాని అనుభవం మానసికమైన "నా" అనే అహాన్ని శక్తిమంతం చెయ్యటం ద్వారా భ్రాంతికీ, దుఃఖానికీ దారి తీస్తుందంతే. మనస్సు అనుభవాలతో, జ్ఞాపకాలతో, జ్ఞానంతో నిండిపోయి ఉన్నట్లయితే మనం ఏం తెలుసుకోగలం? మనం తెలుసుకుని ఉంటే, దాన్ని అనుభవం పొంద గలమా? అనుభవించటానికి తెలిసినది అడ్డురాదా? మీకా పువ్వుపేరు తెలిసి ఉండొచ్చు. అంత మాత్రం చేత ఆ పువ్వుని అనుభవం పొందినట్లేనా? అనుభవం ముందు కలుగుతుంది. తరవాత దానికొక పేరుపెట్టి అనుభవానికి బలాన్ని చేకూర్చటం జరుగుతుంది. ఈ పేరు పెట్టటం ఇంకా అనుభవించకుండా ఆటంకపడుతుంది. అనుభవించే స్థితిలో పేరు పెట్టకుండా జ్ఞాపకంతో సంపర్కం లేకుండా స్వేచ్ఛగా ఉండొద్దా?

జ్ఞానం పైపైదే. పైపైనే ఉన్నది ప్రగాఢమైనదానికి దారితీయగలదా? తెలిసి ఉన్నదాని ఫలితమైన మనస్సు, గతం యొక్క ఫలితమైన మనస్సు అది స్వయంగా తాను కల్పించుకున్న వాటికి అతీతంగా పోగలదా? కొత్తదాన్ని