పుట:Mana-Jeevithalu.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

18

మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

ఆనందదాయకంగా ఉంది.

అంతలో మేము అక్కణ్ణించి లేచి సముద్రం వైపుకి వెళ్ళే రోడ్డు మీదుగా, దీపాలతో వెలుగుతున్న ధనవంతుల ఇళ్ళను దాటుకుంటూ బయలుదేరాం. ధనవంతులు వారి ప్రత్యేక వాతావరణంలో వారు ఉంటారు. ఎంత సంస్కృతి ఉన్నప్పటికీ, ఎంత అసాధారణంగా ఉన్నప్పటికీ, సంప్రదాయం, పై మెరుపూ ఉన్నప్పటికీ, ధనవంతుల్లో, లోతు తెలియనంత విశ్వాసపూరితమైన గాంభీర్యం, చెక్కు చెదరని స్థైర్యం, అభేద్యమైన కాఠిన్యం ఉంటాయి. వారు ధనాన్ని సొంతం చేసుకోవటం కాదు, ధనమే వారిని సొంతం చేసుకుంటుంది. అది మరణం కన్న అధమస్తమైనది. వారి అహంభావమే వారి ధర్మబుద్ధి. తమ సంపదకు తాము రక్షకుల మనుకుంటారు. వారు దానాలు చేస్తూఉంటారు. ధర్మ సంస్థలు స్థాపిస్తూ ఉంటారు. అన్నిటినీ నిర్వహించేదీ, నిర్మించేదీ, ధారపోసేదీ వారే. క్రైస్తవ మందిరాలూ, దేవలయాలూ నిర్మిస్తారు. కాని వారి దేవుడు బంగారం దేవుడు. ఇంత దారిద్ర్యం, ధైన్యం చుట్టూ ఉండగా ధనవంతులుగా ఉండటానికి ఎవరైనా బాగా మోటుతేరి ఉండాలి. వారిలో కొంతమంది ప్రశ్నలు వెయ్యటానికీ, చర్చించటానికీ, సత్య శోధనకీ వస్తూ ఉంటారు. దరిద్రులకు మల్లేనే ధవవంతులకి కూడా సత్యాన్వేషణ అతి కష్టం. దరిద్రులు, ధనం, అధికారం సంపాదించాలని తాపత్రయ పడుతుంటారు. ధనవంతులు తాము పన్నిన వలలో తామే చిక్కుకుని ఉంటారు. కాని వారి నమ్మకాలు వదలుకోకుండా ఆ దారినే సాగిపోతూ ఉంటారు. వర్తక సామగ్రితోనే గాక దైవంతో కూడా వారు వ్యాపారం చేస్తారు. రెండింటితోనూ వినోదిస్తారు. కాని విజయం సాధించేది వారు కోరుకున్న విషయాల్లోనే. వారి నమ్మకాలూ, పూజలూ, వారి ఆశలూ, భయాలూ - వాటికి సత్యంతో ఎలాంటి సంబంధమూ లేదు. వారి హృదయాల్లో శూన్యం తప్ప ఏమీ లేదు. పైకి ఎంత డాబుగా ఉంటే లోపల అంత దారిద్ర్యం ఉంటుంది.

సంపద, సుఖం, హోదా - వీటిని వదలిపెట్టటం అంతకష్టమేమీ కాదు. కాని, ఎదో ఉండాలనీ పడే తాపత్రయాన్నీ వదిలిపెట్టాలంటే విశేషమైన తెలివీ, అవగాహనా కావలసి ఉంటుంది. సంపదవల్ల వచ్చే అధికారం సత్యాన్ని గ్రహించకుండా ఎలా ఆటంకం కలిగిస్తుందో అలాగే