పుట:Mana-Jeevithalu.pdf/269

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

260

మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

నిజమైనదే కావచ్చు. మీరు చేసే కార్యం అర్థం లేని పారిపోయే మార్గం కావచ్చు.

"ఇదంతా చాలా కలవరపెడుతోంది. దీని గురించి నేను చాలా జాగ్రత్తగా ఆలోచించాలి."

చెట్లక్రింద వేడెక్కువవుతూంటే అక్కడ నుంచి లేచాం. అయితే, లోతులేని మనస్సు మంచినెలా చేస్తుందెప్పుడైనా? "మంచి" చేయటమే లోతైన మనస్సుని సూచిస్తుందా? మనస్సు ఎంత గడుసుగా, సూక్ష్మంగా, జ్ఞానమయంగా ఉన్నా లోతు లేనిదే కదా ఎప్పుడూ? లోతులేని మనస్సు ఎన్నటికీ ఆగాధమైనది అవలేదు. అవటమే లోతులేకుండా ఉండటం. స్వయం కల్పితమైన దాన్ని అందుకోవాలని ప్రయత్నించటమే అవటం. కల్పిత రూపం మాటల్లో అత్యంత ఉన్నతం కావచ్చు, విశాల దృక్పథం కావచ్చు. పథకంగాని ప్రణాళిక గాని కావచ్చు. కాని అది అప్పటికీ లోతులేని దానిలో ఉద్భవించినదే. ఏం చెయ్యాలని చేసినా సరే, మనస్సంచలనం ఏ స్థాయిలోనైనా సరే, లోతులేనిదిగానే ఉంటుంది. లోతులేని మనస్సు తన కార్యకలాపాలు వృథా అనీ, ఉపయోగం లేనివనీ గ్రహించలేదు. లోతులేని మనస్సే కార్యకలాపంలో మునిగి ఉంటుంది. ఈ కార్యకలాపమే దాన్ని ఆ స్థితిలో ఉంచుతుంది. దాని కార్యకలాపమే దాన్ని ప్రభావితం చేస్తుంది. ప్రభావితం అవటం వ్యక్తంగా అయినా, అవ్యక్తంగా అయినా సంఘర్షణ నుంచీ, పోరాటం నుంచీ విముక్తి పొందాలని కోరుతుంది. ఈ కోరికే జీవన సంచలనాన్నీ, అపరిచిత వాయువులనీ అడ్డుకోవటానికి గోడలు కడుతుంది. నిర్ణయాలూ, నమ్మకాలూ, సమర్ధనలూ, సిద్ధాంతాలూ అనే గోడలతో మనస్సు స్థిరంగా ఉండిపోతుంది. లోతులేనిది నిలవుండి అంతమైపోతుంది.

నిబద్ధం చేయటం ద్వారా రక్షణ కల్పించుకోవాలనే కోరికే మరింత సంఘర్షణనీ, సమస్యల్నీ పెంపొందిస్తుంది. నిబద్ధం చేయటమే వేరు చేయటం. వేరుగా ఉన్నదీ ఒంటరిగా ఉన్నదీ బ్రతకలేదు. వేరుగా ఉన్నది తక్కిన వేరుగా ఉన్నవాటితో కలిసి మొత్తం ఒకటి కాలేదు. వేరుగా ఉన్నది ఎప్పటికీ ఒంటరిగానే ఉంటుంది - అది కూడబెట్టటానికీ, చేరవేయటానికీ, విస్తృతం చేయటానికీ, ఇముడ్చుకోవటానికీ, ఐక్యం చేసుకోవటానికీ ప్రయత్నించినప్పటికీ, నిబద్ధం చేయటం విధ్వంసకరం. వినాశకరం. కాని,