పుట:Mana-Jeevithalu.pdf/268

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

స్వలాభంకోసం వినియోగించుకోవటం, కార్యకలాపం

259

లెటుపోతున్నాయో తెలియకుండా ఉన్న తెలివితక్కువ వాళ్లు చేసేపని సంఘర్షణకీ, గందరగోళానికీ, దుఃఖానికీ దారితీస్తుంది.

మీ సమస్య అన్యమనస్కతకు లోనవటం కాకపోవచ్చు. అది ఉన్నప్పుడు ఏమవుతుంది?

"నేను అంకితమైన కార్యానికిది ఇబ్బంది కలిగిస్తోంది."

మీరు సంపూర్ణంగా అంకితం కాలేదు - మీ సమస్య మీ ఏకాగ్రతని భంగం చేస్తున్నది కనుక. మీరు అంకితం కావటం ఆలోచనారహితమైన చర్య కావచ్చు. ఈ సమస్య దానికి సూచన - ఈ కార్యకలాపాల్లో చిక్కుకోవద్దని హెచ్చరిక.

"నేను చేస్తున్నది నాకిష్టమే."

అదే అసలు చిక్కు అయి ఉండవచ్చు. ఏదో ఒక రకమైన కార్యకలాపంలో మనల్ని మనం మరిచిపోవాలనుకుంటాం - అ కార్యకలాపం ఎంత సంతృప్తినిస్తే దాన్ని అంతగా పట్టుకు వ్రేలాడతాం. సంతృప్తి కలగాలని కోరటం తెలివితక్కువ. సంతృప్తి ఏస్థాయిలోనైనా ఒకటే. సంతృప్తిలో ఉన్నతమైనదనీ, నీచమైనదనీ లేదు. మనం సంతృప్తిపడటాన్ని వ్యక్తంగా గాని అవ్యక్తంగా గాని ఉత్కృష్టమైన మాటల్లో కప్పిపుచ్చవచ్చు, కాని సంతృప్తి పొందాలనే కోరికే మనల్ని మందకొడిగానూ, సున్నితత్వం లేకుండానూ చేస్తుంది. ఏదో ఒక కార్యకలాపం ద్వారా మనం సంతృప్తీ, సౌఖ్యం, మానసిక రక్షణా పొందుతాం. అది పొందుతూనో, పొందుతున్నట్లు ఊహించుకుంటూనో మనకి ఏవిధమైన ఇబ్బందీ కలుగకూడదని వాంఛిస్తాం. కానీ, ఇబ్బంది ఎప్పుడూ ఉంటుంది - మనం చచ్చిపోతేనో, సంఘర్షణ, పోరాటం అనే ప్రక్రియ మొత్తం అర్థం చేసుకుంటేనోతప్ప. మనలో చాలామంది చచ్చిపోవాలనీ. సున్నితత్వం లేకుండా ఉండాలనీ కోరుకుంటారు - జీవించటం బాధాకరం కనుక. ఆ బాధని ఎదుర్కొంటూ, ప్రతిఘటించడానికీ, నిబద్ధులై ఉండటానికీ గోడలు కట్టుకుంటారు. రక్షణ కల్పించేటట్లు కనిపించే ఈ గోడలు మరింత సంఘర్షణనీ, దుఃఖాన్నీ పెంపొందిస్తాయి. సమస్యని తప్పించుకునే మార్గం వెతకటం కన్న సమస్యని అర్థం చేసుకోవటం ముఖ్యం కాదా? మీ సమస్య