పుట:Mana-Jeevithalu.pdf/266

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
257
స్వలాభంకోసం వినియోగించుకోవటం, కార్యకలాపం

నన్ను ఉపయోగించుకుంటే నాకు అభ్యంతరం లేదు. దానికి ఎంతో విలువ ఉంది. దానితో ఐక్యం పొందాలని ఉంది నాకు. నన్ను వాళ్లు ఏం చేసుకుంటారన్నది అంత ముఖ్యం కాదు - నాకేమీ విలువ లేదు కనుక. ఈ లోకంలో నేను చెయ్యగలిగిందాట్టే లేదు. అందుచేత చెయ్యగలిగేవాళ్లకి సహాయం చేస్తున్నాను. కాని, నా వ్యక్తిగతమైన మమకారం ఒకటి నా దృష్టిని ఆ పనిమీద నిమగ్నం కాకుండా చేస్తోంది. ఈ మమకారాన్నే అర్థం చేసుకోవాలనుకుంటున్నాను."

కాని, మిమ్మల్ని ఎవరైనా ఎందుకు వినియోగించుకోవాలి? మిమ్మల్ని వినియోగించుకునే వ్యక్తిగాని, సంఘంగాని - వారంత ముఖ్యమూ కాదా మీరు?

"ఒక ప్రయోజనం కోసం నేను ఉపయోగపడితే నాకభ్యంతరం లేదు. అందులో ఎంతో అందం ఉంది. దానికి ఈ లోకంలో విలువ ఉంది. నేను ఎవరితో పని చేస్తున్నానో వాళ్లు ఆధ్యాత్మికంగా ఉన్నతాదర్శాలున్నవాళ్లు. ఏం చెయ్యాలో వాళ్లకే బాగా తెలుసును."

మీకన్న వాళ్లకే మంచి చెయ్యగల స్తోమత ఉన్నదని ఎందుకనుకుంటారు మీరు? మీరన్నట్టు వారు ఆధ్యాత్మికమైనవారని మీకెలా తెలుసు? వారికి ఎక్కువ వివేకదృష్టి ఉన్నదని మీకెలా తెలుసును? మీరు మీ సేవల్ని అంకితం చెయ్యాలనుకున్నప్పుడు ఈ విషయం గురించి ఆలోచించే ఉంటారు కదా. లేక, ఆకర్షితులై, భావావేశంతో చలించిపోయి మిమ్మల్ని మీరు ఆ కార్యానికి అర్పించుకున్నారా?

"అది చక్కని ప్రయోజనం. దానికి సహాయ పడాలనిపించింది కాబట్టి నా సేవల్ని అర్పించుకున్నాను."

ఒక ఉన్నత ప్రయోజనం కోసం చంపటానికి గాని, చావటానికి గాని సైన్యంలో చేరే వాళ్లలాంటి వారే మీరు కూడా. వాళ్లేం చేస్తున్నారో వాళ్లకి తెలుసునా? మీరేం చేస్తున్నారో మీకు తెలుసునా? మీరు అర్పిస్తున్న సేవ "ఆధ్యాత్మిక ప్రయోజనం" కోసమేనని మీకు ఎలా తెలుసును?

"మీరన్నది నిజమే. క్రిందటి యుద్ధంలో నాలుగేళ్లపాటు నేను