పుట:Mana-Jeevithalu.pdf/254

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
245
సమైక్యత

కుంటున్నారు. సున్నితత్వం, సుకుమారత్వం మొత్తం ప్రక్రియ. దాన్ని ఒక ప్రత్యేకమైన, తృప్తికరమైన స్థాయిలో తెగకొట్టటానికి వీల్లేదు.

"కాని నేను అందాన్నీ, సున్నితత్వాన్నీ కోరుతున్నాను."

నిజంగానా? అదే అయితే, అందం గురించి ఆలోచించటమంతా మానెయ్యాలి. ఈ ఆలోచనా, ఈ ఆరాధనా, ఉన్నస్థితి నుంచి, అంటే మీనుంచి మీరు పారిపోవాలని చేసే ప్రయత్నం కాదా? మీరు ఏవిధంగా ఉన్నారో, ఉన్నస్థితి ఏమిటో తెలుసుకోకుండా ఉన్నట్లయితే మీరు సున్నితంగా ఎలా ఉండగలరు? అభివృద్ధి చెందాలనే ఆకాంక్ష ఉన్నవాళ్లూ, నైపుణ్యం ఉన్నవాళ్లూ, అందాన్ని అభిలషించేవాళ్లూ తమస్వయం కల్పిత రూపాలను ఆరాధిస్తారంతే. వాళ్లు పూర్తిగా తమ చుట్టూ తాము ఆవరించుకుని, తమ చుట్టూ గోడ కట్టుకుని ఉంటారు. ఒంటరిగా ఏదీ ఉండలేదు కనుక బాధ కలుగుతుంది. అందం కోసం ఈ అన్వేషణ, కళ గురించి నిరంతరం మాట్లాడుతూ ఉండటం జీవితం నుంచి, అంటే తన నుంచి తానే పారిపోవటానికి గౌరవనీయంగా, ఉన్నతంగా పరిగణింపబడే మార్గం.

"కాని సంగీతం పారిపోయే మార్గం కాదు"

తన్ను తాను అవగాహన చేసుకునేందుకు బదులు దాన్ని అనుసరిస్తే అదీ అంతే. తన్ను తాను అర్థం చేసుకోకపోతే అన్ని కార్యకలాపాలూ గందరగోళానికీ, బాధకీ దారితీస్తాయి. 'నేను' నీ ఆలోచన పనిచేసే పద్ధతుల్నీ అవగాహన చేసుకున్నప్పుడే స్వేచ్ఛ ఏర్పడుతుంది. స్వేచ్ఛ ఉన్నప్పుడే సున్నితత్వం ఉంటుంది.

74. సమైక్యత

ఆ చిన్న కుక్కపిల్లలు బొద్దుగా శుభ్రంగా ఉన్నాయి. వెచ్చని ఇసుకలో ఆడుకుంటున్నాయి. ఆరున్నాయి అవి. అన్నీ తెల్లగా, మట్టిరంగు మచ్చలతో ఉన్నాయి. తల్లి వాటికి కొంచెం దూరంలో నీడలో పడుకుంది. సన్నగా బక్కచిక్కి ఎంత గజ్జిపట్టి ఉందంటే ఒంటిమీద ఒక్క వెంట్రుక కూడా లేదు.