పుట:Mana-Jeevithalu.pdf/250

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అందం

241

కోసం, ఒక లక్ష్యం కోసం చర్య తీసుకోవటం భవిష్యత్తు దృష్టిలో చర్య తీసుకోకపోవటమే. అప్పటికప్పుడు చూస్తే చర్య తీసుకుంటున్నట్లే తోస్తుంది. కాని అటువంటి చర్య ఆత్మవిధ్వంసకమైనది.. అది మన దైనందిన జీవితంలో స్పష్టపడుతూనే ఉంది.

"కాని ఎవరైనా ఏవిధమైన ప్రభావానికీ లోనుకాకుండా ఉండగలరా? అది సాధ్యం కాదనిపిస్తుంది మాకు."

మళ్లీ ఒక ఊహ, ఒక నమ్మకం మిమ్మల్ని బంధిస్తోంది. మీరు నమ్ముతారు, మరొకరు నమ్మరు. మీరిద్దరూ నమ్మకానికి బంధితులే. మీరు ప్రభావితమైన దాన్ని బట్టే మీరు అనుభవం పొందుతారు. ప్రభావితం కావటం యొక్క, ప్రభావం యొక్క ప్రక్రియ మొత్తాన్ని గమనిస్తేనే స్వేచ్ఛగా ఉండటానికి సాధ్యమవుతుంది. ఈ ప్రక్రియని అర్థం చేసుకోవటమే స్వీయ జ్ఞానం. ఒక్క స్వీయజ్ఞానం వల్లనే బంధం ఉంచి స్వేచ్ఛ ప్రాప్తిస్తుంది. ఈ స్వేచ్ఛ ఎటువంటి నమ్మకమూ లేకుండా, ఎటువంటి సిద్ధాంతమూ లేకుండా ఉంటుంది.

73. అందం

గ్రామం మురికిగా ఉంది, కాని ప్రతి గుడిసె చుట్టూ శుభ్రంగా ఉంది. వాకిలి కడిగి రోజూ ముగ్గువేసినట్లుంది. గుడిసె లోపల కూడా పరిశుభ్రంగానే ఉంది, వంటవల్ల వచ్చే పొగ తప్పించి, ఇంటిల్లపాదీ అక్కడే ఉన్నారు - తండ్రీ, తల్లి, పిల్లలు, ఒకముసలావిడ, నాయనమ్మ అయిఉండొచ్చు. అందరూ సంతోషంగా, చిత్రంగా తృప్తిపడుతున్నట్లుగా ఉన్నారు. మాటలద్వారా తెలుసుకోవటం కష్టం. మాకు వాళ్ల భాష రాదు. మేము కూర్చున్నాం. ఎవరికీ ఇబ్బందిగా అనిపించలేదు. వాళ్ల పనులు వాళ్లు చూసుకుంటున్నారు. పిల్లలు దగ్గరికి వచ్చారు. ఒక పిల్లవాడూ, ఒక పిల్లా కూర్చున్నారు చిరునవ్వు నవ్వుతూ. సాయంకాలం భోజనం తయారయినట్లే ఉంది. అంత ఎక్కువగా ఏం లేదు. మేము వెళ్లిపోతూంటే అందరూ బయటికి వచ్చి చూస్తూ నిలబడ్డారు. సూర్యుడు నది మీదికి వచ్చాడు ఒకే ఒక పెద్ద మేఘం వెనుక నుంచి. మేఘం